Monday, December 9, 2024

Annavaram – సత్యదేవుడిని దర్శించుకున్న నారా భువనేశ్వరీ..

అన్నవరం సత్యనారాయణ స్వామి వారిని టీడీపీ అధినేత చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి ఆలయానికి వెళ్లిన ఆమె చంద్రబాబు త్వరగా విడుదల కావాలంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భువనేశ్వరి, కుటుంబసభ్యులకు అర్చకులు వేదాశీర్వచనం పలికారు. వారితో పాటు తెదేపా సీనియర్‌ నేత నిమ్మకాయల చినరాజప్ప, మరికొందరు ముఖ్యనేతలు ఉన్నారు. కాగా, భువనేశ్వరి అన్నవరంకు వచ్చిన నేపథ్యంలో అక్కడకు టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement