Monday, April 29, 2024

Big Clash – మంత్రి సెంథిల్ బాలాజీని బర్తరఫ్ చేసిన గవర్నర్ – ఆ అధికారం లేదన్న సీఎం స్టాలిన్

చెన్నై – తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తమిళనాడు క్యాబినెట్ నుంచి మంత్రి సెంథిల్ బాలాజీని తొలగిస్తూ గవర్నర్ ఆర్ఎన్ రవి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ సంఘటన మరోసారి గవర్నర్, సీఎం ఎంకే స్టాలిన్ మధ్య ఘర్షణకు కారణం కాబోతోంది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను సంప్రదించకుండానే తమిళనాడు గవర్నర్ సెంథిల్ బాలాజీని రాష్ట్ర మంత్రివర్గం నుంచి తొలగించారు. ఇటీవల మనీలాండరింగ్ కేసులో మంత్రి సెంథిల్ బాలాజీని ఈడీ అరెస్ట్ చేసింది. ఇటీవల కాలంలో ఏ గవర్నర్ కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు..

గవర్నర్‌కు ఆ హక్కులేదు.. సీఎం స్టాలిన్‌తన మంత్రివర్గ సహచరుడు సెంథిల్‌ను గవర్నర్‌ బర్తరఫ్‌ చేయడంపై సీఎం స్టాలిన్‌ స్పందించారు. గవర్నర్‌ రవి తీరును తప్పుబట్టారు. గవర్నర్‌కు ఆ హక్కులేదని.. ఈ అంశాన్ని న్యాయపరంగా ఎదుర్కొంటామని ప్రకటించారు

.

Advertisement

తాజా వార్తలు

Advertisement