Wednesday, May 8, 2024

బహుపుణ్యప్రదం గోవిందనామ సంకీర్తన!

కలియుగ వైకుంఠం తిరుమలలోని శ్రీ స్వామివారి దర్శనానికి వెళ్లిన భక్తులు, ఏదైనా పూజ పునస్కారాల్లో గోవింద నామము జపించి పరవశించిపోవటం… ఒక దివ్యా నుభూతి పొందటం గురించి వేరే చెప్పాల్సిన పనిలేదు. ఇంతటి మహమాన్వితం పర మ పవిత్రం అయిన శ్రీ వెంకటేశ్వరస్వామివారికి ప్రీతిపాత్రమైన ఈ గోవిందా నామము వెను క వున్న మహత్తును గూర్చి తెలుసుకుందాం.
తిరుమల తిరుపతి క్షేత్ర పురాణమునకు సంబంధించి అనేక సంఘటనలు, గాథలు ప్రజా బాహుళ్యంలో ప్రసిద్ధి చెందిన విషయం తెలియని హందువు ఉండరనడంలో అతిశ యోక్తి లేదు. అలాంటి గోవింద నామము తిరుమల తిరుపతి వేంకటేశ్వరునికి ఎలా వచ్చిం ది? అనగా ఆ కాలంలో అగస్త్య మహర్షి తన యజ్ఞ యాగాది క్రతువుల కోసం ఒక పెద్ద గోశాల ఏర్పరుచుకున్నారు. ఆ గోశాలలో వందలాది ఉత్తమ జాతి గోవులు వుండేవి. శ్రీనివాసుడు పద్మావతీ దేవిని పరిణయమాడే ముందు స్వామి వారు ఒక రోజు అగస్త్య మహర్షి ఆశ్ర మానికి వెళ్ళారు. అంతట మహర్షి వేంకటేశ్వరునికి భక్తిపూర్వక గౌరవ మర్యాదలతో ఆహ్వా నించి భక్తి శ్రద్ధలతో సేవించారు. అప్పుడు వేంకటేశ్వరస్వామి తనకి గోశాలలో వున్న ఒక గోవు ని ఇమ్మని మహర్షిని కోరగా, సకల భువనాలను ఏలేటువంటి వేంకటేశ్వరుడు తన దగ్గరకు వచ్చి ఒక గోవుని దానమిమ్మని అడిగినందులకు అగస్త్య పరమానందం చెందాడు. దివ్య దృష్టి వున్న ఆయన ”ఓ మహానుభావా! మీరు ఎవరన్నది నాకు తెలుసు. నేను చెప్పగా మీరు తెలు సుకోవలసిన శాస్త్రాలు, ధర్మ సూక్ష్మాలంటూ ఏవీ లేవు, మీకు శాస్త్రం ధర్మం తెలియనిది కాదు. గోవు లను బ్రహ్మచారులకు దానం చేయకూడదని, సంసారులకే దానమి వ్వాలని కదా శాస్త్రం అన్నారు మహర్షి. కారణం గోవుల సంరక్షణ గృహస్తుల ఇంటనే బాగా జరుగుతుంది. గోమా త శ్రీ మహా లక్ష్మీ అంశ. గోవుని సంరక్షించి శాస్త్రోక్తంగా గోవుని పూజించాలి. గృహణి వున్న ఇంట్లోనే ఇవి సంప్రదాయబద్ధంగా జరుగుతాయి.
గో సంరక్షణ సక్రమంగా సాగదు. కనుక కలియుగంలో మీరు అవ తరించినట్లే, మహాలక్ష్మీ అమ్మవారు కూడా పద్మావతీదేవిగా అవతరించారు. కనుక మీరు ఆ దేవిని పాణిగ్రహణం చేసుకుని పద్మావతీదేవి సమేతంగా నా ఆశ్రమం పావనం చేసిన ప్పుడు మీకు ఒక గోవుని దానం చేస్తాను” అని స్వామివారికి వినయంగా వేడుకున్నారు అగస్త్య మహర్షి. అదివిన్న మహావిష్ణువు అగస్త్యుని ఆంతర్యం గ్రహంచుకొని వెళ్ళిపోయారు. అనం తరం పద్మావతీదేవిని పరిణయమాడిన శ్రీనివాసుడు తన దేవేరి పద్మావతి సామేతంగా అగస్త్య మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. అయితే ఆ సమయాన ఆశ్రమంలో మహర్షి లేరు. అక్క డున్న శిష్యులకు విషయం తాను వచ్చిన కారణం తెలిపాడు. తనకు ఒక గోవును దానంగా ఇవ్వమని అడిగారు.
శిష్యులకు ధర్మసంకటమైన పరిస్థితి ఏర్పడింది. గురుదేవులు లేని సమయంలో తాము స్వతంత్రించి వారి సొత్తును దానం చేయడం సముచితం కాదనే సందిగ్ధంలో పడినవారు శ్రీనివాసు స్వామి తమ గురుదేవులు అగస్త్య ముని వచ్చేదాకా విశ్రాంతి తీసుకొమ్మని వారు రాగానే వారే స్వయంగా తమకు గోవుని సమర్పిస్తారని శిష్యులు వినయంతో అన్నారు.
సమంజసమైన శిష్యుల విన్నపం గ్రహంచిన శ్రీనివాసుడు వారి పరిస్థితిని అర్థం చేసు కుని, ”ఫర్వాలేదు.. నేను బయలుదేరుతాను..” అని పద్మావతీదేవితో సహా తిరుమలకి బయ ల్దేరి వెళ్ళిపోయాడు. శ్రీ వేంకటేశ్వరుడు వెళ్ళిన కొద్దిసేపటికి ఆశ్రమానికి తిరిగి వచ్చిన మహ ర్షి జరిగిన సంగతి అంతా శిష్యులు చెప్పగా తెలుసుకొని చాలా చింతించాడు.
”అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకునికి గోవులు కొదవా? ఆ పురుషోత్తమునికి నేను దానమివ్వాలా? ఇందుకోసం ఆ దేవదేవుడు ఇన్ని తిప్పలు పడడమా? అంతా పరమాత్ముని లీలా వినోదం కాదా?” అని అగస్త్య మహర్షి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. ఏవిధంగా నైనా మహావిష్ణువుని కలుసుకొని తన దగ్గర వున్న గోవులలో కామధేనువు వంటి ఉత్తమ గోవు ని యివ్వాలని నిశ్చయించుకుని వెంటనే ఒక మంచి గోవుని వెంట పెట్టుకుని వేంకటేశ్వరుడు పద్మావతీదేవి వెళ్ళిన మార్గానే అతి వేగంగా నడచివెళ్ళాడు కొంతసేపటికి దూరాన నడచి వెడుతున్న శ్రీనివాసుడు మహర్షికి కనిపించాడు. ఆయనను చూసి గట్టిగా కేక వేస్తూ పిలిచా డు. ”స్వామీ… గోవు.. ఇందా.. స్వామీ గోవు… ఇంద” అని అరిచి పిలిచాడు. పిలుపు వినపడలే దు. అయినా పదేపదే మహర్షి మరింత గట్టిగా ”స్వామీ.. గోవు.. ఇందా” అని అన్నాడు. అప్పు డు కూడా వేంకటేశ్వరస్వామి తిరిగి చూడలేదు. మహర్షి మళ్ళీ, మళ్ళీ ”గోవు.. ఇందా.. స్వా మి… గోవు.. ఇందా” అని స్వామి వెంటనే అనుసరిస్తూ పిలుస్తూనే వున్నాడు.
అప్పటివరకు వరకు మెల్లిగా అడుగులు వేస్తున్న పద్మావతి శ్రీనివాసులు మరింత వేగంగా నడవనారంభించారు. అగస్త్య మహర్షి తన గొంతుని ఇంకా పెంచి ”గోవు.. ఇందా.. గోవు ఇందా” అని వేగంగా అనుసరిస్తూ ఉచ్ఛరిస్తున్న ఆ గోవు ఇందా” అన్న ప్రార్ధన నడక వేగానికి ”గోవిందా… గోవిందా”గా మారి ప్రకృతి అంతా ప్రతిధ్వనించింది.
ఈవిధంగా మహర్షి ”గోవిందా గోవిందా” యని స్వామిని 108 సార్లు పిలిచిన తర్వాత శ్రీనివాసుని రూపంలో వున్న మహావిష్ణువు ఆగి తిరిగి చూశారు. అగస్త్య మహర్షి ఉరుకులు పరుగులతో గోవుని తీసుకుని వేంకటేశ్వరుని వద్దకు వచ్చాడు.
వేంకటేశ్వరుడు మహర్షిని సేద దీర్చి ఆయన ఇచ్చిన గోదానం స్వీకరించారు. శ్రీనివా సుడు అగస్త్యునితో ”గోవు… ఇందా” అంటూ మీరు పలికిన ”గోవిందా” నామం నాకు ఎంతో ప్రీతిని కలిగించింది. నన్నెంతో ఆనందింపచేశారు. ఈ కలియుగంలో నన్ను పిలవడానికి యీ గోవింద నామమే ఉత్కృష్టమైనదని స్వామి సెలవిచ్చారు. ”తమ జీవాత్మలైన గోవులను ఎవరైతే నాకు చెందాలని కోరుకుంటున్నారో, వారందరూ ‘గోవింద’ నామం జపిస్తే చాలు నేను వారికి అనుగ్రహం ప్రసాదిస్తాన”ని తిరుమలలో వేంకటేశ్వరుడై భక్త సులభునిగా వెలి శారు. అందుకే గోవిందనామ సంకీర్తనం పుణ్య ప్రదం. తిరుమల తిరువీధుల్లో రేయిం బవళ్ళు మార్మోగే గోవింద నామ పారాయణం సర్వ శుభప్రదం.

Advertisement

తాజా వార్తలు

Advertisement