Tuesday, May 21, 2024

Telangana BJP – క‌మ‌ల‌ద‌ళంలో సంచ‌ల‌నం ఏదీ?

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణ బీజేపీలో అలసత్వం రాజ్యమేలుతోందా..? అధిష్టానం ఫెయిల వుతోందా…? అసలు సమస్య ఎక్కడుంది…? ఎందు కు సరైన సమయంలో మేనిఫెస్టో, అభ్యర్థుల ఖరారు చే యడంలో విఫలమవుతోందా…? ఇవే ప్రశ్నలు ఇప్పు డు రాష్ట్ర ప్రజల్లో జరుగుతోన్న చర్చలో కీలకమ వు తున్నాయి. తెలంగాణ అసెంబ్లిd ఎన్నికలు దగ్గర పడు తున్న కొద్దీ బీజేపీ పార్టీలో సరికొత్త సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. పలువురు సీనియర్లు కాంగ్రెస్‌ బాట పడుతున్న పరిస్థితి ఉన్నా బీజేపీలో చలనం లేద నే చర్చ సాగుతోంది. మరోవైపు బీజేపీ-జనసేన పొత్తు ఖరారయ్యే ఫైనల్‌ స్టేజ్‌లో శుక్రవారం రెండో జాబితా ప్రకటించింది. ఊహించని రీతిలో ఒకే ఒక అభ్యర్థితో జాబితా విడుదల చేసింది. తొలి జాబితాలో 52 మందిని ప్రకటించిన తర్వాత తీవ్ర అసంతృప్తులు, అలకలు చోటుచేసుకున్నాయి. రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరా రు. ఈ నేపథ్యంలో మలి విడత జాబితాకు పార్టీ కావాలనే జాప్యం చేసినట్లు ప్రచారం జరిగింది.

తెలంగాణ బీజేపీలో నాయకత్వ మార్పు తర్వాత కూడా పరిస్థితి మారలేదు. ఇప్పుడు మరింత ఎక్కు వగా అసంతృప్తి పెరిగిపోతోందన్న సూచనలు కనిపిస్తు న్నాయి. నాయకత్వ మార్పు తర్వాత చంద్రశేఖర్‌, యెన్నం శ్రీనివాసరెడ్డి, తాజాగా రాజగోపాల్‌రెడ్డి వంటి వారు పార్టీ మారిపోయారు. ఇటీవల జరుగుతున్న మార్పులతో మరికొంత మంది సీనియర్‌ నేతలు కూ డా మండిపోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర బీజేపీలో నివురుగప్పిన నిప్పులా పరిస్థితి ఉం దని.. ఎప్పుడైనా బద్దలు కావొచ్చునన్న ఆందోళన ఎక్కువగా కనిపిస్తోంది. అయితే బీసీ కార్డును నమ్ము కున్న బీజేపీ తొలి జాబితాలో బీసీలకు 17మందికి చోటు కల్పించింది. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. జనసేన పొత్తుతో మరికొందరు పార్టీ వీడుతారనే ప్రచా రం జరుగుతోంది. జనసేన 20 సీట్లకు పట్టుబ డుతున్నట్లు తెలుస్తోంది. గతంలో 32 సీట్లలో పోటీ చేస్తామని జనసేన ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, ఖమ్మం, నల్గొం డ జిల్లాలోని సరిహద్దు నియోజకవర్గాలను కోరు తోందని సమాచారం.

వలస నేతలతోనే…
బీజేపీలో మొదటి నుంచి ఉన్న నేతలకు ఆ తర్వా త వివిధ పార్టీల నుంచి వచ్చి చేరిన నాయకులకు మధ్య ఆదిపత్య పోరు పెరుగుతోందన్న అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. అయితే ఈటల రాజేందర్‌కు ఇటీ-వల పార్టీలో ప్రాధాన్యత పెంచారు. ఆయన తీసుకునే నిర్ణ యాలపై అభ్యంతరం చెప్పేందుకు ఇతర నేతలు సిద్ధం గా ఉంటు-న్నారని అంటు-న్నారు. అదే సమయంలో కేసీఆర్‌ను గద్దె దించేందుకు ప్రత్యామ్నాయంగా బీజేపీ లో చేరితే, ఇప్పుడు రెండు పార్టీల మధ్య ఉన్న రహస్య అవగాహనతో తమ లక్ష్యం నెరవేరడం లేదని మరి కొందరు ఆరోపిష్తున్నారు. ఇదే పార్టీలో కొనసాగితే కేసీ ఆర్‌కు వ్యతిరేకంగా పోరాడలేమన్న అభిప్రాయంలో ఇంకొందరున్నారు.

చేరికల్లో వైఫల్యం….
బీజేపీలో చేరికల కమిటీ- చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించిన ఈటల రాజేందర్‌ బీఆర్‌ఎస్‌ నుంచి భారీ ఎత్తున చీలికలు తెచ్చి, నేతల్ని బీజేపీలోకి తీసుకొస్తారని ఆశించారు. అలాంటిదేం అక్కడ జరక్కపోవడంతో ఈటలపై పార్టీ పెద్దలు కూడా నమ్మకం కోల్పో తున్నారు. ఇటీ-వల ఖమ్మం సభలో ఇరవై రెండు మంది బీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు పార్టీలో చేరుతారని ప్రచారం చేశారు. కానీ.. ఒక్కరు కూడా చేరలేదు. దీంతో ఆయ నకు ఇవ్వాల్సిన దాని కంటే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తు న్నారన్న చర్చ జరుగుతోంది. ఈటల రాజేందర్‌ వ్యవ హారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి ఇబ్బం దికరంగా మారినట్లు- పార్టీలో చర్చ జరుగుతుంది. అంబర్‌పేట నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి సి.కృష్ణయాదవ్‌ను బీజేపీలోకి తీసుకొచ్చేందుకు ఈ టల రాజేందర్‌ పూర్తిస్థాయి కసరత్తు చేశారు. కృష్ణ యాదవ్‌ కూడా ఆగస్టు 30న బీజేపీలో చేరుతున్నానని ప్రకటించారు. దానిలో భాగంగా హైదరాబాద్‌ సిటీ-లో తనతో పాటు- ఈటల రాజేందర్‌, మోడీ, అమిత్‌షా, నడ్డాల ఫొటోలతో భారీ ఎత్తున ప్లెnక్సీలు ఏర్పాటు- చేశా రు. పార్టీలో చేరేందుకు అన్నీ సిద్ధం చేసుకున్నాక, అ నూహ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డి అడ్డుపడ్డారు. తన నియోజకవర్గంలో తనకు సమాచారం లేకుండా కృష్ణయాదవ్‌ను పార్టీలోకి ఎలా తీసుకుంటారని ఆయన ఈటలతో వాగ్వివాదానికి దిగి నట్టు- తెలిసింది. అదే రోజు ఉదయం మాజీ గవర్నర్‌ చెన్నమనేని విద్యాసాగరరావు కుమారుడిని కాషా యకండువా కప్పి కిషన్‌రెడ్డి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అక్కడ తుల ఉమకు వేములవాడ టిక్కెట్‌ ఇప్పిస్తాననే హామీతో ఈటల రాజేందర్‌ తనతోపాటు- బీజేపీలోకి తెచ్చారు.

- Advertisement -

కీలక నేతలు కాంగ్రెస్‌లోకి అనే ప్రచారం…
యెన్నం శ్రీనివాసరెడ్డి తాను కాంగ్రెస్‌లో చేరు తున్నట్లు-గా ప్రకటించారు. మరికొంత మంది సీని యర్‌ నేతలు కూడా అదేబాటలో ఉన్నారని ప్రచారం జోరందుకుంది. తనతో పాటు- ఈటల రాజేందర్‌, కోమ టిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, వివేక్‌, రవీంద్రనాయక్‌ వంటి నేతలమంతా కలిసి కాంగ్రెస్‌తో చర్చలు జరిపామని యెన్నం చెబుతున్నారు. పార్టీలో చేరతామని చెప్పిన కొందరు మాట తప్పారనీ, తాను మాత్రం కాంగ్రెస్‌లో చేరుతున్నాననీ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌ను బీజేపీలో ఉంటే ఎదుర్కోలేమనీ, ఉద్దేశ్యపూర్వకంగానే బీఆర్‌ఎస్‌కు బీజేపీ లోపాయికారి సహకారాన్ని అందిస్తున్నదనీ ఆరోపించారు. రోజులు గడిచే కొద్దీ.. బీజేపీలో పరిస్థితి మరింత దిగజారిపోతున్నదన్న అభి ప్రాయం వినిపిస్తోంది. ఇదిలా ఉండగా పొత్తుల పేరు తో అభ్యర్థుల ప్రకజనలో జాప్యం ఈ పార్టీకి మరిన్ని ఇబ్బందులు తెచ్చి పెడుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement