Thursday, May 2, 2024

అద్వైత సిద్ధాంత కరుణారస సముద్రుడుశంకర భగవత్పాదులు

భారత చరిత్రలో ఆది శంకరాచార్య భగవత్పాదులు ఒక అద్భుతమైన శక్తి. భారతీయ జీవన విధానానికి, సాంఘిక వ్యవస్థకు జీవన గడ్డయైన వేదాంతాన్ని ప్రబోధించిన శంకరాచార్యులు భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపించే అద్వైత సిద్ధాంతం పరమాత్మ- జీవా త్మ ఒక్కటేనని, జీవాత్మ పరమాత్మలకి అభేదం ‘ఏకమేవా అద్వితీయం బ్రహ్మ’ ‘జీవో బ్రహ్మని నా పర:’ అనే వ్యాఖ్యల అద్వైత సిద్ధిని చెబుతాయి. ఈ జ్ఞానాన్ని పొందిన జీవాత్మ మోక్షం పొందగలుగుతుంది. అంటే పరమాత్మలో లీనమౌతుంది. ఇలాంటి జ్ఞానం పొం దడానికి అందరికీ సాధ్యం కాదు.
భారతీయ సంస్కృతి వైభవానికి కృషి సల్పిన మహాత్ములలో శంకరాచార్యులు ఒక రు, ద్వైత, అద్వైత, విశిష్టాద్వైతాలనే త్రిమతాలు. ఆనాటి ఆర్ష ధర్మానికి వ్యతిరిక్తంగా వున్న మతాలను ఖండించడమే కాకుండా భారతీయ సంస్కృతిలో అద్వైత సిద్ధాంత సమభా వాన్ని ఆధారం చేసుకొని శంకరులు శైవం, వైష్ణవం, శాస్త్రం, శూలం, గానపత్యం, కౌమా రం అనే మతాలలోని దోషాలను తొలగించి షణ్ముఖ స్ధావనాచార్యులై వివిధ మతాల మధ్య సామరస్య భావన పెంపొందించుటకు, సంప్రదాయాల మధ్య వున్న అంతర్లీన సూ త్రాన్ని ప్రచారం చేసి, పంచాయతన పూజావిధానాన్ని వ్యాపింపజేసి, ఇష్ట దైవాన్ని పూజిం చేట్లుగా విధి. విధానాలను అమలుచేసే విధంగా పూజా విధానంలోని లోపాలను సవరిం చిన ఆధ్యాత్మిక సంస్కర్త శంకరాచార్యులు,
దక్షిణ ప్రాంతమందు కేరళ రాష్ట్రంలో పూర్ణానది తీరమందు వున్న వృషభాచల పర్వతంపై ప్రసిద్ధిచెందిన వృషాదీశ్వర ఆలయ మున్నది. దానికి సమీపమున గల ‘కాల డి’ అనే గ్రామంలో ఈశ్వరనామ సంవత్సర వైశాఖ శుద్ధ పంచమి సోమవారం ఆరుద్ర నక్షత్ర ప్రథమ పాదమున సతీదేవి, శివ గురువు దంపతులకు సాక్షాత్తూ ఆ పరమ శివుని అంశన జన్మించారు.
సబ్రాహ్మణుడైన శివగురువు వేదాలన్నింటిని అభ్యసించాడు. శివగురువు దంపతు లకు చాలాకాలం వరకు సంతానం కలగలేదు. శివ గురువు తన భార్యతో, తమకు సంతా నం కలగనందులకు బాధను వ్యక్తపరుస్తూ ‘అపుత్రస్య గతిర్నాస్తి’ అని పుత్ర సంతానం లేనందున తమకు ఇహపరములలో గతులుండవని తెలిసి సంతానం కోసం వృషాదీశ్వ రుని పూజించి, పరమేశ్వర అనుగ్రహం వలన జన్మించిన ఈశ్వర సంభూతులు కాబట్టి ‘శంకర’ అని నామకరణం చేశారు. ‘శంకర’ అంటే సర్వ శుభాలకు, సర్వ సంపదలకు, సర్వ విద్యలకు మూలాధారమైనవాడని అర్ధం.
శంకరులు పుట్టిన నాల్గవ యేటనే తండ్రి పరమపదించారు. ఐదవ యేట ఉపనయ నం జరిగింది. గురు కులానికి వెళ్ళి గోవింద భగవత్‌పాదుల వద్ద శిష్యునిగా చేరి నాలుగు వేదాలను, తర్కవిద్యలు నభ్యసించి బ్రహ్మ విద్యోపదేశం పొందాడు. ఎనిమిదవ యేట సన్యాసాన్ని స్వీకరించి, పన్నెండేళ్ళకు సర్వశాస్త్ర వేత్తగా భాసించారు. తర్క వితర్కాల శాస్త్ర చర్చలలో భారతీయులకు తిరుగులేదని ఋజువు చేసి ఆరాధ్య గురువయ్యారు.
సర్వమతాల సారాన్ని, సారాంశాన్ని ఆకళింపు చేసుకొని అనేక సమస్యలతో, విభిన్న మతాలతో, అనేకులుగా చీలిపోయిన సమాజాన్ని అద్వైత స్థాపనతో ఒకటి చేసి, ప్రచారం కోసం తూర్పున గోవర్ధన మఠం, దక్షిణాన శృంగేరి మఠం, పశ్చిమాన ద్వారక మరం, ఉత్తరాన జ్యోతిర్మఠం పేరిట భారతదేశంలో నాల్గు మఠాలు స్థాపించి వరుసగా పద్మ పాదుడు, సర్వేశ్వరుడు, హస్తామలకుడు, తోటకుడు ఈ పీఠాలకు తొలి పీఠాధిపతులుగా నియమించాడు. తదనంతరం దేశమంతటా పర్యటించి ఇతర విశ్వాసాలతో వున్నవా రినందరినీ అద్వైతంలోకి తెచ్చాడు. కర్నాటకలోని తుంగభద్రానదీ తీరమందున్న శృంగేరీకి వేంచేసి అద్వైత వ్యాప్తికి శారదా పీఠాన్ని స్థాపించారు. ఇది శంకరులు స్థాపించిన తొలి శృంగేరి పీఠం. ఆ పీఠాదిపతులందరినీ శంకరాచార్యులని పిలుస్తారు.
ప్రచారానికి బయలుదేరిన శంకరులు బాకీపట్నం నేర్‌ విశాలాక్షి సహత విశ్వనాధుని దర్శనం చేసుకొని స్వామిని కీర్తిస్తూ ”మనీష పంచకం’ అనే ఐదు శ్లోకాలను చెప్పారు.
భిక్షాటన చేస్తూ ఒకనాడు కడు బీదరాలు ఇంటికి వెళ్లి ఆ ఇంట్లో ఏమీలేక ఆ ఇల్లాలు సన్యాసిని రిక్త హస్తాలతో పంపడం ఇష్టం లేక, ఇల్లంతా వెతికి ఎండిపోయిన ఒక ఉసిరికాయను శంకరుని జోలెలో వేయగా, ఆమె పరిస్థితికి చలించిన శంకరులు బీదరాలు ఇంట బంగారం ఉసిరి కాయలు కురిపించమని లక్ష్మీదేవిని స్తుతించగా లక్ష్మి ప్రసన్నురాలై ఆ ఇల్లాలి ఇంట బంగారపు ఉసిరికాయలను కురిపించింది. అదే కనకధారాస్తోత్రం.
తమిళనాడులో తిరుచ్చి సమీపాన తిరువనైకర్‌ దగ్గర వున్న అఖిలాండేశ్వరి దేవాల యాన్ని సందర్శించారు. అందు దేవి విగ్రహం చాలా ఉగ్రంగా వుండడం వల్ల ఎవ్వరూ ఎదురుగా నిలబడలేకపోయేవారు. ఈ విషయం తెలిసిన శంకరులు రెండు. తాటంకాల ను సృష్టించి అమ్మవారికి బహూకరించారు. ఆ ఆభరణాలతో అమ్మ ఉగ్రత తగ్గి శాంత దేవి అయింది.
శ్రీశైలం సందర్శించి మల్లికార్జునస్వామి మీద శివానందం.. హరిని అశువుగా వర్ణించారు. విజయవాడ కనకదుర్గమ్మ మధుర మీనాక్షి అమ్మ, తదితర దేవతా విగ్ర#హ ప్రతిష్ట బిసమయంలో ఋషులు, మానవులు ప్రతిష్టించిన యంత్రాలలో బీజాలను తొలగించి సాత్విక బీజాక్షరాలు ప్రతిష్టించారు. ఈవిధంగా శంకరులు దేశమంతా కలియ తిరిగి బదరీక్షేత్రం చేరగానే శ్రీ విష్ణువు ప్రత్యక్షమై అలకానందలోని తన విగ్రహాన్ని బయ టికి తీసి ప్రతిష్టించమని ఆనతించారు. అదే సుప్రసిద్ధ బదరీ నారాయణ స్వామివారి క్షేత్రం.
శృంగేరిలో వుండగానే తల్లి అవసాన దశలో పున్నట్లు తెలుసుకొన్న శంకరులు యో గవిద్య ద్వారా కాలడికి చేరుకొని.. తల్లికి సంస్కారాలు చేశారు. కన్నతల్లినే షూయ గురించిన బోధ చేసి సాక్షాత్తు పరమేశ్వరుడే ప్రత్యక్షం కావడం శంకరాచార్య ”మహా పురుషతత్త్వాన్ని దివ్యాంశ ప్రభావాన్ని వెల్లడిస్తున్నాయి. ఒకసారి నర్మదానది పొంగి పొర్లుతున్న సమయంలో తన ‘కమండలంలోని జలాకర్షక మంత్రం ద్వారా వరద నీటిని ఆకర్షించి. ప్రజలను రక్షించాడు. అతి సామాన్య జీవితాన్ని గడపటం సర్వమానవ ‘సమా నత్వానికి మానవతా దృక్పథానికి ప్రత్యక్ష దృష్టాంతం మూకాంబికా అమ్మ క్షేత్రానికి వెళ్తే చనిపోయిన ఒక బ్రాహ్మణ బాలుని బ్రతికించారు.
32 సంవత్సరాల తన జీవితకాలంలో 24 గ్రంథాలకు భాష్యాలు రచించారు. ఉపని షత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీతపై భాష్యాలు, అమరోక్షానుభూతి, భజగోవిందం, వివేక చూడామణి.. శతశ్లోకి, శివానందలహరి, సౌందర్యలహరి, ఆనందలహరి, భవానీ. భుజంగ, గణశ పంచరత్న, దక్షిణామూర్తి, లక్ష్మీ నరసింహ, మీనాక్షి, పంచరత్నాలు ఇం కా బ్రహ్మ మీ మాంస, ఉత్తర మీమాంస, బ్రహ్మ సూత్రాలను మనకు అందించిన ఘనత శంకరాచార్యుల వారికే దక్కుతుంది. ఆదిశంకరులు వ్రాసినన్ని విషయాలు ఈ ప్రపంచం మొత్తంమీద మరెవరూ వ్రాసి వుండరు. అందుకే ఆయన కృతయుగంలో దక్షిణామూర్తి … ద్వాపరయుగంలో వేదవ్యాసుడు కలియుగంలో ఆదిశంకరులని పండితులు వచ నం.
ఆధ్యాత్మిక జీవన విధానంలో శంకరులు అత్యున్నత స్థాయిలో పరిగణింప దగిన వారు. మానవులందరినీ భక్తి, జ్ఞాన కర్మల ద్వారా అద్వైత మార్గాన నడిపి, మోక్ష మార్గాన్ని చూపిన జగద్గురువులు శంకర భగవత్పాదులు. శంకరాచార్యులు కర్ణాటక లగ్నజులు, లగ్నమందు బృహస్పతి. శంకరులు లగ్నమాధారముగా సౌమ్యులు ఆధ్యాత్మికశక్తి సంపన్నులు. లోకాన్ని రక్షించేవాడు, వేద శాస్త్రాలకు నిధానమైనవాడు. కరుణా రససముద్రుడైన శ్రీ శంకర భగవత్పాదుల జయంతి రోజున స్మరిద్దాం.!!.. తరిద్దాం.!! పునీతులమౌదాం.!!

Advertisement

తాజా వార్తలు

Advertisement