Friday, May 10, 2024

పుత్రుని కాదు… ముందు తండ్రినే అనాలి!

ఉ|| ఒక్కఁ డొకం డనేక విధ యుద్ధ
జయంబులు గొన్నవారు వా
రెక్కడ? నేమి సేసె నితఁ? డీతని
తమ్మునిఁ గూలనేసి యు
క్కెక్కిన పార్థుపైఁ గవిసెనే? పసు
లాతఁడు గ్రమ్మఱింపఁగా
నక్కడ లేఁడె వీఁడు? భవదాత్మజుఁ
గోల్పడె ఘోషయాత్రలోన్‌.
(తిక్కన భారతం, ఉద్యోగపర్వము,)
కర్ణునికి ఒక తమ్ముడున్నాడు. అతని పేరు సంగ్రామజిత్తు. విరాటపర్వం చివరలో పంచమాశ్వాసంలో కేవలం 79,80 పద్యాల లో ఇతని ప్రస్తావన వస్తుంది. కర్ణుడు చూస్తుండగానే యుద్ధంలో అర్జునుని చేతిలో మరణిస్తాడితడు. కర్ణుడిని ఉద్దేశించి భీష్ము డు పై పద్యంలో చెబుతున్నది అదే! ”తమ్ము డిని రక్షించుకోలేని అసమర్ధుడు వీడు. వీడిని నమ్ముకుని నీ కొడుకు పాండవులపై విజ యం సాధించాలని కలలు కంటున్నాడు.”
‘మగఁటిమి వారికి వీఁడెదురుగ నమ్మి సుయోధనుఁడు విరోధము గొని’- పరాక్ర మంలో పాండవులకు వీడు (అనగా ఈ కర్ణు డు) సమానమైనవాడుగా నమ్మి సుయో ధనుడు వారితో కయ్యానికి కాలుదువ్వుతు న్నాడు అంటాడు. ఈ సందర్భంలో కర్ణు డిని గురించి మాట్లాడిన ప్రతిచోట ‘వీడు’ అనే మాటతోనే సంబోధిస్తాడు భీష్ముడు. ‘ఒకట నైనను వారి యందొకరిలోని చిదుర పాలును బోలండు; సిగ్గులేక ‘పాండవుల గెల్తునే’నని పలుకుచుండు’- ఒక్క విషయం లోనైనా పాండవులలో ఏ ఒక్కరిలోని చిన్న తునకతో సమానమైన వాడు కాడు. సిగ్గులే కుండా పాండవులపై విజయం సాధిస్తానని అంటూ వుంటాడు’ అని ఏమాత్రం సందే హం లేని మాటలతో తన అసమ్మతిని, కర్ణుని ప్రవర్తన పై తన అసహ్యాన్ని తెలియజేస్తాడు భీష్ముడు. భీష్ముడు వారించలేదని ఎలా అన గలం? ‘ఈ దురాత్ముండు కర్జం బెరుంగక నీతిబా హ్యుండై వలసినట్లు ప్రేలరిమాట లాడు చుండు; నీవునుఁ గైకొని వినుచుండు దువు; మేల కాక!’- ఈ దుర్బుద్ధి గలిగిన కర్ణుడు చేయవలసిన మంచిపని యేదో తెలి యక నీతిలేని వాడై నోటికి వచ్చినట్లు పేలు తూ వుంటాడు, నువ్వు నోరు మూసుకుని వింటూ వుంటావు. మేలే జరుగుతుందిలే!’ చెప్పి చెప్పి విసుగెతి ్తన పెద్దాయన మాటలివి.
భీష్మునిచేత ఇంతగా తిట్టించుకునీ, చివ రకు ధృతరాష్ట్రుడు అడుగుతాడు సంజయు డిని, ‘ధర్మపుత్త్రున కిక్కడి తలపు భంగి
యెట్టులుండు? యెవ్వరిఁ
గొని యతండు కౌరవుల మీఁద కెత్తి రాఁగలుగువాఁడు?’
”ఇదంతా సరేగాని, ధర్మరాజు ఇక్కడి సై న్యం బలం గురించి ఏమనుకుంటున్నాడు? ఎవరిని తన బలంగా భావించి మాపై యుద్ధా నికి సన్నద్ధమౌతున్నాడు?” అని. ఇది విని సంజయుడు ఒక పెద్ద నిట్టూర్పు విడుస్తాడు ”ముందుగా. .. కొడుకును కాదు, ముందు తండ్రినే అనాలి” అని ఆ నిట్టూర్పుకు అర్ధం.

Advertisement

తాజా వార్తలు

Advertisement