Tuesday, April 30, 2024

సీతక్క దీక్షను భగ్నం చేయడాన్ని ఖండిస్తున్నాం: వైఎస్ షర్మిల

కరోనాతో పేద ప్రజలు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స తీసుకోలేక..ఇటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్లు దొరక్క కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో కరోనా వైద్యాన్ని ఆరోగ్య శ్రీలో చేర్చాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. గత రెండు రోజుల నుంచి ములుగు ఎమ్మెల్యే సీతక్క ఈ అంశంపై నిరాహార దీక్ష చేయగా ఈ రోజు పోలీసులు ఆమే దీక్షను భగ్నం చేశారు. తాజాగా కరోనాను తక్షణమే ఆరోగ్యశ్రీలో చేర్చాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు సీతక్క దీక్షను భగ్నం చేయడాన్ని షర్మిల ఖండించారు. ఎలాంటి పరిష్కారం చూపకుండా దీక్షకు ఎలా భంగం కలిగిస్తారని షర్మిల ప్రశ్నించారు. కరోనా వైద్యాన్ని ఆరోగ్య శ్రీలో చేర్చాలపి డిమాండ్ చేస్తూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ని ఎమ్మెల్యే సీతక్కతో పాటు తెలంగాణ సీఎంవోకు ట్యాగ్ చేశారు షర్మిల.

ఇక ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలన్న షర్మిల..అంబులెన్సులు అందరికీ అందుబాటులో ఉండే చర్యలు చేపట్టాలని షర్మిల డిమాండ్ చేశారు. కోవిడ్ చికిత్సా సెంటర్ల సంఖ్యను పెంచడంతో పాటుగా..వైద్య, ఆరోగ్యశాఖలో ఖాళీగా ఉన్న 23,512 పోస్టులను భర్తీ చేయాలి డిమాండ్ చేశారు. ఈ విపత్కర పరిస్థితుల్లో అడ్డుఅదుపు లేకుండా దోచుకుంటున్న ప్రైవేట్ ఆసుపత్రులపై నియంత్రణ కమిటీ వేసి..కార్పోరేట్ ఆసుపత్రుల దోపిడీని అరికట్టాలని ప్రభుత్వానికి సూచించారు. ఇక అక్రిడిటేషనుతో సంబంధం లేకుండా జర్నలిస్టులందరినీ ఆదుకోవాలని..జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించి మెరుగైన వైద్యం అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు వైఎస్ షర్మిల.

Advertisement

తాజా వార్తలు

Advertisement