Monday, May 6, 2024

చిన్నారులను అనాథలుగా చేసిన కరోనా.. ఆపన్నహస్తం కోసం ఎదురు చూపు

కరోనా మహమ్మారి కుటుంబాలకు కుటుంబాలనే  చిన్నాభిన్నం చేసింది. ఇప్పటికే వైరస్ ధాటికి అనేక కుటుంబాలు తమవారిని కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్నాయి. కరోనా రక్కసి కుటుంబాలను కబలిస్తున్న తీరు గుండెల్ని బరువెక్కిస్తోంది. చాలా కుటుంబాల్లో తల్లిదండ్రులను పొట్టనపెట్టుకుంటున్న మహమ్మారి.. చిన్నారుల్ని అనాథలుగా మార్చేస్తోంది. నా అన్నవారు లేక పిల్లలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అభం శుభం తెలియని ఆ చిన్నారుల పట్ల విధి చిన్నచూపు చూసింది. అమ్మ నాన్నలతో కలిసి గడపాల్సిన వయసులోనే వారిని దూరం చేసింది. దీంతో చిన్నారులు అనాధలుగా మిగిలిపోతున్నారు. అమ్మానాన్నల నీడలో సంతోషంగా జీవితం గడపాల్సిన చిన్నారులు ఆపన్నహస్తం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన పసునూరి సునిత రాజు దంపతులకు పాప కావేరి(4), బాబు జస్వత్ (6) ఇద్దరు సంతానం వీరి కుటుంబం పుట్టుకతో బీద కుటుంబం. తల్లితండ్రులు ఇద్దరు కూలినాలి చేస్తూ జీవనోపాధి కొనసాగించేవారు. ఆరేళ్ల క్రితం సునిత అనారోగ్యంతో మృతి చెందింది. ఆనాటి నుండి తండ్రి రాజు, నాయనమ్మ సరోజ ఆసరాతో  జీవనం సాగిస్తున్నారు. వీరి కుటుంబంపై కక్ష కట్టిన కరోనా మహమ్మారి ఈ మధ్యే తండ్రి రాజుని బలిగొంది. ఆకుటుంబంలో తండ్రి మృతిచెందడంతో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు. నాయనమ్మకు వచ్చే ఈనెల పింఛన్ తో జీవనం సాగిస్తున్నారు. అనాథలైన పిల్లలు ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఏపీ తప్పుదోవ పట్టిస్తోంది: కేఆర్ఎంబీకి తెలంగాణ లేఖ

Advertisement

తాజా వార్తలు

Advertisement