Monday, October 14, 2024

Yes I am … అవును నేను క‌ర‌సేవ‌కుడినే…బండి సంజ‌య్

వేములవాడ రాజన్న తన ఇలవేల్పు అని పలు వేదికలపై చెప్పిన కేసీఆర్ వేములవాడ అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వేములవాడ నియోజకవర్గ అభ్యర్థి చెన్నమనేని వికాస్ కు మద్దతుగా బండి సంజయ్ ప్రచారం నిర్వహించారు. అధిక సంఖ్యలో పాల్గొన్న అభ్యర్థులకు ఘనస్వాగతం పలికారు. రాజన్న గుడి దగ్గర ప్రజలనుద్దేశించి బండి సంజయ్ మాట్లాడుతూ.. వేములవాడ అభివృద్ధే ధ్యేయంగా బీజేపీ తరపున డాక్టర్ చెన్నమణి వికాస్ పోటీచేస్తున్నారని, కాంగ్రెస్, బీఆర్ ఎస్ లాగా దోచుకోవాలనే ఉద్దేశం ఆయనకు లేదన్నారు.

రెండుసార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్ వేములవాడ అభివృద్ధికి చేసిందేమీ లేదు. దర్గా కట్టించినా సీఎం కొడుకు నాస్తికుడు, హిందూ వ్యతిరేకి అని చెప్పడంలో ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదన్నారు. తాను అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే బాబ్రీ మసీదు కూల్చివేతపై కేసీఆర్ మాట్లాడుతున్నారని, తాను కరసేవలో పాల్గొన్నానని గర్వంగా చెప్పుకుంటున్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement