Tuesday, May 7, 2024

తెలంగాణకు ఎల్లో అలర్ట్‌.. వారం రోజులపాటు వర్షాలుంటాయని హెచ్చరిక

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాబోయే వారంరోజులపాటు పలు జిల్లాల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురువనున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నరూలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వానలు , కొన్ని చోట్ల జల్లులు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. హైదరాబాద్‌లో గరిష్టంగా 30 డిగ్రీలు, కనిష్టంగా 22 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వివరించింది. తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి గాలులువీస్తాయని తెలిపింది.

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని నల్గొండ, ఖమ్మంతోపాటు పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసాయి. వారం రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. హైదరాబాద్‌ నగరంలో పలు కాలనీలు, బస్తీలు వరద ముంపులోనే కాలం గడుపుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement