Saturday, April 27, 2024

మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి – లోకేష్ కుమార్

నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు కల్పించేందుకు జిహెచ్ఎంసి కృషి చేస్తున్నదని కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ తెలిపారు. గురువారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో కమిషనర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ… హైదరాబాద్ నగరం విశ్వ నగరంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో చేరుకోవాల్సిన గమ్యస్థానానికి సకాలంలో చేరే విధంగా రవాణా వ్యవస్థను మెరుగు పరిచేందుకు ఎస్.ఆర్.డి.పి ద్వారా 42 పనులు చేపట్టగా ఇప్పటి వరకు 31 పనులు పూర్తయ్యాయని తెలిపారు. అందులో 18 ఫ్లై ఓవర్లు, 5అండర్ పాసులు, 7 ఆర్ ఓ బి, ఆర్ యు బి లు అందుబాటులోకి తేవడం జరిగిందన్నారు. మిగతా 11 పనులన్నింటినీ వచ్చే సంవత్సరం జనవరిలో పూర్తి  కానున్నాయన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మెరుగైన రవాణా ఏర్పాటు, నిర్వహణ కోసం సి.ఆర్.ఎం.పి ద్వారా 811.96 కిలోమీటర్ల రోడ్డు నురీ కార్పెట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 744.46 కిలోమీటర్లను రీ-కార్పెట్ చేయడం జరిగిందని తెలిపారు.

లోతట్టు ప్రాంతాల్లో నివసించే నగర వాసులకు వరద ముంపు పరిష్కారానికి జిహెచ్ఎంసి పరిధిలో రూ.733 కోట్ల అంచనా వ్యయంతో 35 పనులను చేపట్టడం జరిగిందన్నారు. అందులో ఇప్పటి వరకు 8 పనులు పూర్తి కాగా మిగిలిన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. నగరవాసులకు మౌలిక సదుపాయాలుకల్పించే భాగంగా వివిధ పనులను చేపట్టడం జరిగిందన్నారు. ముఖ్యంగా అంతర్గత రోడ్లు, స్టార్మ్ వాటర్ డ్రైన్ లు, నాలా పూడికతీత, కమ్యూనిటీహాల్స్ కాంపౌండ్ వాల్స్ నిర్మాణాలు, అన్ని మతాల స్మశాన వాటికల అభివృద్ధికి ఈ సంవత్సరంలో రూ.2250.27 కోట్ల అంచనా వ్యయంతో 10,021 పనులు చేపట్టడం జరిగిందన్నారు. అందులో ఇప్పటి వరకు 4225 పనులు పూర్తి కాగానే మిగతా పనులు వివిధ ప్రగతి దశ లోఉన్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్లు శ్రీతిఓజా, ప్రియాంక అలా, యాదగిరిరావు, కృష్ణ, కెన్నడీ, ఇ.వి.డి.ఎం డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, ఈ.ఎన్.సి జియా ఉద్దీన్, సిసిపి దేవేందర్ రెడ్డి, సి.ఇ దేవానంద్, అడిషనల్ సిపి శ్రీనివాస్, హౌసింగ్ ఓ.ఎస్.డి సురేష్ కుమార్, ఎస్.ఇ లు దత్తు పంతు, విద్యాసాగర్, జాయింట్ కమిషనర్లు శశిరేఖ, సంద్య, సెక్రటరీ లక్ష్మి, మేయర్ ఓ.ఎస్.డి విజయకృష్ణ, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement