Saturday, April 27, 2024

MDK: ఇంటింటా సంక్షేమం బీఆర్ఎస్ తోనే సాధ్యం.. ఎమ్మెల్సీ యాదవ రెడ్డి

గజ్వేల్, అక్టోబర్ 13 (ప్రభ న్యూస్) : ఊరూరా అభివృద్ధి… ఇంటింటా సంక్షేమం బీఆర్ఎస్ తోనే సాధ్యమని ఎమ్మెల్సీ యాదవ రెడ్డి అన్నారు. గజ్వేల్ మండలంలోని దిలాల్ పూర్ గ్రామంలో గజ్వేల్ రూరల్ మండల భూత్ స్థాయి సమావేశాన్ని భారస మండల అధ్యక్షుడు బెండే మధు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎఫ్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ లు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ యాదవ రెడ్డి మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించడం ఇక్కడి ప్రజల అదృష్టమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మంత్రి హరీష్ రావు ఆదేశానుసారం బీఆర్ఎస్ మండల భూత్ కమిటీల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో వివిధ వర్గాల ప్రజల కోసం సంక్షేమ పథకాలు తీసుకొచ్చి వారి ముఖాల్లో సంతోషం నింపుతూ వారిలో ఆత్మవిశ్వాసం నింపుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులను రాజుగా చూడాలన్న కోరికను నిజం చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. వ్యవసాయం దండగ అన్న పరిస్థితి నుండి వ్యవసాయమే ఒక పండగ అనే స్థాయికి తీసుకువచ్చి రైతుల్ని అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత కూడా రాష్ట్ర బీఆర్ ఎస్ దేనన్నారు.

తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా కేసిఆర్ తీర్చి దిద్దారని, ఆసియా ఖండంలో పెద్దదైన కాళేశ్వరం ప్రాజెక్ట్ 3 సంవత్సరాల్లో మిషన్ మోడ్ లో పూర్తి చేశారన్నారు. పాతాళంలోకి వెళ్ళిన నీటిని భూమి మీదకి ఊబికి వచ్చేలా ముఖ్యమంత్రి కేసీఆర్ చేశారన్నారు. ఒక వినూత్న పంథలో ప్రజల కోసం ఆలోచిస్తూ చావు నోట్లో తలకాయ పెట్టి రాష్టాన్ని సాధించి తాను కలలు కన్న బంగారు తెలంగాణకై ఆలోచిస్తూ నిజం చేసి చూపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ ప్రాంత ఎమ్మెల్యేగా ఉండి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలు అందిస్తున్న సీఎం కేసీఆర్ ను ముచ్చటగా మూడోసారి ఇక్కడ నుండి ఎమ్మెల్యేగా అత్యదిక ఓట్ల మెజార్టీ ఇచ్చి హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా చూద్దామన్నారు.

ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పంగ మల్లేశం, ఆత్మకమిటి చైర్మన్ ఊడేం కృష్ణారెడ్డి, ప్యాక్స్ చైర్మన్ జేజేల వెంకటేశం గౌడ్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మద్ది రాజిరెడ్డి, వైస్ ఎంపీపీ కృష్ణా గౌడ్, సర్పంచ్ ల ఫోరమ్ మండల అధ్యక్షుడు చెరుకు చంద్రమోహన్ రెడ్డి, మండల బీఆర్ఎస్ నాయకులు పండరి రవీందర్ రావు, మద్దూరి శ్రీనివాస్ రెడ్డి, వెంకన్న గారి దయాకర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, చిన్న మల్లయ్య, రఘుపతి రెడ్డి, బొల్లారం ఎల్లయ్య, ఎంపీటీసీ ఫోరమ్ అధ్యక్షుడు అశోక్, మండల ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్, తాటికొండ మధుసూదన్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, వివిధ కమిటీల డైరెక్టర్లు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, నాయకులు, భూత్ కమిటీ మెంబర్లు, కార్యకర్తలు, పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement