Monday, May 20, 2024

భారీ వర్షాలతో అనంతగిరి వాటర్ ఫాల్స్ కు జ‌ల‌క‌ళ‌..

వికారాబాద్ జులై 21 (ప్రభ న్యూస్): గత నాలుగు రోజులుగా ఏకదాటిగా కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా వికారాబాద్ జిల్లా అనంతగిరి అటవీ ప్రాంతంలో గల గుట్టపై నుండి అనంతగిరి వాటర్ ఫాల్స్ కొనసాగుతున్నాయి. ఈ సంవత్సరంలో మొదటిసారిగా భారీ వర్షాల నేపథ్యంలో ఈ వాటర్ ఫాల్స్ రావడంతో పర్యాటకులు పెద్ద సంఖ్యలో వాటిని చూడడానికి త‌ర‌లివ‌స్తున్నారు.

వర్షాలు తగ్గిన అనంతరం ఈ వాటర్ ఫాల్స్ కు పెద్ద ఎత్తున పర్యాటకులు రానున్నారు. నందిగాట్ నుండి మూడు కిలోమీటర్ల దూరాన ఈ వాటర్ ఫాల్స్ చూడముచ్చటగా ఉంటాయి. ఎత్తైన కొండల నుండి వాటర్ ఫాల్స్ పడడం పర్యటకులను ఆకర్షిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement