Monday, February 26, 2024

బీసీ ఐక్యవేదిక, బీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలు వాయిదా..

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీవర్షాల కారణంగా బీసీ ఐక్యవేదిక సమావేశం వాయిదా పడింది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావు నేతృత్వంలో శుక్రవారం కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించాల్సి ఉండగా.. భారీ వర్షాల కారణంగా బీసీ ఐక్య వేదిక సమావేశం వాయిదా వేశారు.

బీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలు వాయిదా..

అలాగే రైతులకు కరెంట్ పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని వర్షాల కారణంగా వాయిదా వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement