Friday, May 3, 2024

వరంగల్ లో ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్

రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ఈరోజు వరంగల్ లోని ఎంజిఎం జంక్షన్ వద్ద ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలపై సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను వాహనదారులకు వివరించారు. ట్రాఫిక్ సిబ్బంది ఆధ్వర్యంలో హెల్మెట్ డ్రైవ్ నిర్వహించారు. దాదాపు 200 ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండా వాహనాలను నడుపుతున్న వారిని గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. హెల్మెట్ డ్రైవ్ వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు నుండి ప్రతిరోజు వివిధ ప్రాంతాలలో నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, లేదంటే చట్టరీత్యా చర్య తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement