Thursday, May 2, 2024

వాహ‌నాలు ఆపి డ‌బ్బులు డిమాండ్‌.. పోలీసుల అదుపులో లేడీ గుజ‌రాత్ గ్యాంగ్‌

వరంగల్, ఖమ్మం జాతీయ రహదారిపై వచ్చిపోయే వాహనాలను ఆపుతూ నానా హంగామా చేస్తున్న లేడీ గుజ‌రాత్ గ్యాంగ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏడుగురితో కూడిన ఈ గుజరాతి అమ్మాయిలు వాహ‌నాల‌ను ఆపుతూ ఇబ్బందులకు గురిచేస్తున్న‌ట్టు ప‌లు కంప్లెయింట్స్ అందాయి. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద శివారులో వాహనదారులను ఆపి డబ్బులు డిమాండ్ చేస్తున్న‌ట్టు పోలీసుల‌కు స‌మాచారం అందింది. ఓ ప్రయాణికుడి ఫోన్ కాల్‌తో స్పందించిన పోలీసులు యువతులను అదుపులోకి తీసుకొని స్టేషన్ కు త‌ర‌లించిన‌ట్టు సీఐ సదన్ కుమార్ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement