Saturday, May 11, 2024

NASA: తొలి రిటర్న్ టు ఫ్లైట్.. స్పేస్ షటిల్ డిస్కవరీ నింగిలోకి ఎగిరింది ఈ రోజే!

అది 2005వ సంవత్సరం, జులై 26, సరిగ్గా ఈ రోజే.. అప్పటికే అమెరికాకు చెందిన కొలంబియా అంతరిక్ష వాహక నౌక (2003) కూలిపోయిన ఘటనను ప్రపంచం మరిచిపోలేదు. ఆ ఘటనలో ఏడుగురు ఆస్ట్రోనాట్స్ ప్రాణాలు కోల్పోయారు. కాగా, STS-107 గా పిలుచుకునే స్పేస్ షటిల్ కొలంబియాలో డేవిడ్ బ్రౌన్, లారెల్ క్లార్క్, మైఖేల్ ఆండర్సన్, ఇలాన్ రామన్, రిక్, కల్పనా చావ్లా, విలియం మెక్‌కూల్ అంతరిక్షంలోకి వెళ్లారు. వీరిలో భారత సంతతికి చెందిన కల్పనా చావ్లా తొలిసారి అంతరిక్షంలోకి వెళ్లిన మహిళగా గుర్తింపు పొందారు.

– డిజిటల్​ మీడియా, ఆంధ్రప్రభ

భారత సంతతికి చెందిన మొదటి మహిళా వ్యోమగామి కల్పనా చావ్లా స్పేస్ షటిల్ కొలంబియాలో అంతరిక్షంలోకి ప్రయాణించారు. 16 జనవరి 2003న కల్పన నాసా స్పేస్ షటిల్ కొలంబియా నుంచి అంతరిక్షంలోకి వెళ్లారు. కానీ, ఆమె మళ్లీ భూమికి తిరిగి రాలేదు. ఈ అంతరిక్ష నౌక 1 ఫిబ్రవరి 2003న భూమికి తిరిగి వస్తుండగా కుప్పకూలింది. ఈ స్పేస్ షిప్‌లోని కల్పనా చావ్లాతో సహా మొత్తం ఏడుగురు వ్యోమగాములు చనిపోయారు. అయితే.. ఆ విషాదాన్ని మరిచిపోకముందే నాసా మరో సరికొత్త ప్రయోగం చేపట్టింది. తన రిటర్న్-టు-ఫ్లైట్ మిషన్‌లో భాగంగా స్పేస్ షటిల్ డిస్కవరీని ప్రారంభించింది.

అయితే.. కెన్నెడీ స్పేస్ సెంటర్ నుండి ఈ రాకెట్ని ప్రయోగించిన కొన్ని సెకన్ల తర్వాత ఒక పెద్ద పక్షి నేరుగా షటిల్ బయటి ఇంధన ట్యాంక్ పై ఎగురుతూ కనిపించింది. అందరూ ఏమైతుందో అని భయపడ్డారు. ఆ సమయంలో పక్షి ద్వారా ఎట్లాంటి నష్టం జరగలేదు. ఆ తర్వాత ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా, ప్రయోగ సమయంలో షటిల్ దగ్గరికి పక్షులు రాకుండా నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (NASA) చర్యలు తీసుకుంది.

ఇక.. ఆ మిషన్ ప్రారంభమైన కొన్ని నిమిషాలకు మరో రెండు తెల్లటి పక్షులు షటిల్ దగ్గర ఎగురుతూ కనిపించాయి. వాటిలో ఒకటి ఆర్బిటర్ కుడి రెక్కను ఢీకొట్టింది. అదృష్టవశాత్తూ అప్పుడు కూడా ఎట్లాంటి నష్టం జరగలేదు. అయితే.. STS-114 అనే వాహక నౌక రెండు వారాలపాటు అంతరిక్షంలో గడిపింది. ఆ తర్వాత సురక్షితంగా ఆగస్టు 9వ తేదీన భూమికి తిరిగి వచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement