Wednesday, May 1, 2024

ఏజెన్సీలో టెన్షన్ టెన్షన్.. జల దిగ్బంధంలో వాజేడు

వాజేడు : గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల వలన గోదావరి వరదలు ఉధృతంగా పెరుగుతూ ఏజెన్సీ ప్రాంతాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. గోదావరి వరదలు లోతట్ట ప్రాంతాలను ముంచితడంతో వాజేడు మండలం దిగ్బంధంలో చిక్కుకుంది. 163 జాతీయ రహదారిని ఐదు చోట్ల వరదలతో నీట ముచ్చడంతో ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి రవాణా సౌకర్యాలు స్తంభించింది. చందుపట్ల పెద్ద గంగారం గొల్లగూడెం చికుపల్లి గుమ్మడిదొడ్డి ఇప్పగూడెం సుందరయ్య కాలనీ కడేకల్ కృష్ణాపురం వాజేడు నాగారం తదితర గ్రామాలు నీటి మునిగాయి. వరద బాధిత కుటుంబాలను ఇల్లు ఖాళీ చేయించి పూననివాస కేంద్రాలకు అధికారులు తరలించారు. గోదావరి అతివేగంగా అంతకంతకు పెరుగుతూ ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు వద్ద మూడో ప్రమాద హెచ్చరిక దాటిపోయి గురువారం ఉదయం 8 గంటల సమయానికి 17.450 మీటర్లకు చేరుకుంది. దీనితో వాజేడు మండలం పూర్తిగా జగదిగ్బంధంలో చిక్కుకుపోయింది. ఏ గ్రామానికి వెళ్లాలన్న రహదారులన్నీ నీట మునిగి ఉండడంతో నాటు పడవలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అత్యవసర పరిస్థితులు అయితే తప్ప నాటు పడవలను అధికారులు అనుమతించడం లేదు ఒకవైపు ఏడతెరిపి లేకుండా వర్షాలు కురవడం మరోవైపు గోదావరి ఉధృతంగా పెరుగుతుండడంతో ఏజెన్సీ వాసులు భయాందోళనకు గురవుతూ బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లి తీస్తున్నారు. గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో ఏజెన్సీ వాసుల జనజీవనం అస్తవ్యస్తంగా తయారయింది. కడియం ప్రాజెక్ట్ శ్రీ రామ్ సాగర్ మేడిగడ్డ లక్ష్మి తుపాకులగూడెం సమ్మక్క సారలమ్మ బ్యారేజీల గేట్లు ఎత్తి వేసి వరద నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేయడంతో గోదావరి మరింతగా పెరిగే అవకాశం ఉందని సిడబ్ల్యుసి అధికారులు పేర్కొంటున్నారు. ఈ పెరుగుదల ప్రకారం చూసినట్లయితే 1986 గోదావరిని క్రాస్ చేసే అవకాశం ఉందని పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనితో మన్యం ప్రాంతంలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఏ క్షణం ఏం జరుగుతుందోననే భయం గుప్పెట్లో మండల వాసులు జీవనం సాగిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement