Tuesday, April 30, 2024

అదిరిన ఎమ‌ర్జెన్సీ టీజ‌ర్ – ఇందిరాగాంధీగా కంగ‌నా

వివాదాస్ప‌ద న‌టి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్ సొంత నిర్మాణ సంస్థ మణికర్ణికా ఫిలింస్ బ్యానర్ లో తెర‌కెక్కుతోన్న చిత్రం ఎమ‌ర్జెన్సీ. ఈ చిత్రంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రలో కంగనా రనౌత్ న‌టిస్తంఓఎది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది. టీజర్ లో కంగనారనౌత్ ఇందిరాగాంధీ రూపాన్ని, హావభావాలు, భాషను విజయవంతంగా అనుకరించింది. 1977లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో విధించిన ఎమర్జెన్సీ గురించే ఈ సినిమా ఉంటుందని, అందులో తను ఆమె పాత్రను పోషిస్తున్నట్లు కంగనారనౌత్ ప్రకటించింది. పొలిటికల్ పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఎమర్జెన్సీకి దారితీసిన పరిస్థితులు, రాజకీయ కుట్రలు, దేశం ఎదుర్కొన్న సంక్షోభం వంటివి చూపించనున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement