Saturday, April 27, 2024

Suicide attempt : కలెక్టర్ కార్యాలయం పైకెక్కి… ఒంటిపై డీజిల్ పోసుకొని..!

జనగామ : భూ స‌మ‌స్య ప‌రిష్క‌రించాల‌ని ప్ర‌భుత్వ కార్యాల‌యాల చుట్టూ కాళ్ల‌రిగేలా తిరిగినా ఎంత‌కీ అధికారులు ప‌ట్టించుకోవ‌డం లేదు. దీంతో విసుగు చెందిన భూ బాధితుడు ఆత్మ‌హ‌త్య య‌త్నానికి ఒడిగ‌ట్టాడు. వివ‌రాలు ఇలా ఉన్నాయి..
తన భూ సమస్యను పరిష్కరించాలని పలుమార్లు అర్జీలు పెట్టిన పరిష్కరించకపోవడంతో జనగామ మండలం పసరమడ్ల గ్రామానికి చెందిన నిమ్మల నరసింహారావు సోమవారం జనగామ కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్లాడు. గ్రీవెన్స్ సెల్ లో కూడా సమస్య పరిష్కారం కాకపోవడంతో మనస్థాపానికి గురై కలెక్టర్ కార్యాలయం పైన ఎక్కి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు, ఆర్డీవో మధుమోహన్ కౌన్సిలింగ్ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement