Monday, May 6, 2024

మహా భాగవతం రచించిన పోతన తెలుగు వారు గర్వించదగ్గ కవి : మంత్రి ఎర్రబెల్లి

సహజ కవి బమ్మెర పోతన జయంతి ఉత్సవాలు ఆయన జన్మస్థలం జనగామ జిల్లా పాలకుర్తి మండలం బమ్మెర గ్రామంలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి గ్రామంలోని పోతన మందిరాన్ని సందర్శించారు. పోతన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అదే ఆవరణలో గల శ్రీ సీతా సమేత శ్రీ రామచంద్ర ఆలయంలో పూజలు చేశారు. అంతకుముందు మంత్రికి అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహా భాగవతం రచించిన పోతన తెలుగు వారు గర్వించదగ్గ కవి అన్నారు. సీఎం కేసీఆర్‌ నిర్ణయం మేరకు బమ్మెరలో అభివృద్ధి పనులు కూడా చకచకా సాగుతున్నాయని ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్ ఆలోచనలతో ఈ ప్రాంతాన్ని టూరిజం హబ్‌గా అభివృద్ధి చేస్తున్నాం. పాలకుర్తి ప్రాంత అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శివలింగయ్య, అధికారులు, పలు ప్రాంతాల నుంచి వచ్చిన కవులు, కళాకారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement