Wednesday, April 24, 2024

ఇన్ స్టా రీల్స్ కోసం ప్రయత్నించి.. రైలు ఢీకొని…

ఇన్ స్టా రీల్స్ కోసం ప్రయత్నం… ఓ యువకుడు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. లైక్ లు, కామెంట్ల కోసం ఎన్నో విన్యాసాలు చేస్తుంటారు.. అయితే అలాంటి ప్రయత్నం చేయబోయి ఓ యువకుడు తీవ్రగాయాల పాలయ్యాడు. తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండ జిల్లా ఖాజీపేట నుంచి మంచిర్యాల వెళ్లే రైలుమార్గంలో రైలు పక్కన ఫీట్ చేసిన వడ్డేపల్లికి చెందిన యువకుడు..వెనుక ట్రైన్ వస్తుంటే ట్రాక్ పక్క నుంచి నడుచుకుంటూ వచ్చే వీడియో షూట్ చేస్తుండగా ట్రైన్ ఢీకొనడంతో ఎగరిపడి తీవ్ర గాయాలపాలయ్యాడు. యువకుడి తలకు, కాలుకు తీవ్రగాయాలయ్యాయి. అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement