Sunday, May 5, 2024

రైతు లేనిదే రాజ్యం లేదు: ఎమ్మెల్యే సీతక్క

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన సీసీ రోడ్లు పనులను కొన్ని గ్రామాల వరకే పరిమితం చేసి మిగితా గ్రామాలపై సవతి తల్లి ప్రేమ చూపడం సబబు కాదన్నారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా జెడ్పీ సర్వ సభ్య సమావేశానికి హాజరైన ములుగు ఎమ్మెల్యే సీతక్క పలు అంశాలపై మాట్లాడారు. రైతు లేనిదే రాజ్యం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా వరి ధాన్యం పండిస్తున్నారని తెలిపారు. వరి వేస్తే ఉరి అంటూ ఇప్పుడు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిమీద ఒకరు విమర్శలు చేసుకుంటూ నాటకాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. రైతు పండించిన ప్రతి గింజ రాష్ట్ర ప్రభుత్వ మే కొనుగోలు చేయాలి అని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ములుగు నియోజకవర్గంలోని కొత్త గూడ,గంగారాం మండలాలో ఉపాధి హామీ పనుల్లో ముందు వరసలో ఉన్నాయని తెలిపారు. సీసీ రోడ్లకు ఎన్ఆర్జిఎస్ ద్వారా సీసీ రోడ్లు నిర్మించేందుకు నిధులు మంజూరు చేయాలని సీతక్క కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement