Monday, April 29, 2024

షిరిడీలో ఎమ్మెల్యే గండ్ర జన్మదిన వేడుకలు

భూపాలపల్లి : భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర వెంకటరమణ రెడ్డి జన్మదిన వేడుకలను గురువారం మహారాష్ట్ర లోని 8 షిరిడీలో సద్గురు సాయిబాబా సన్నిధిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేకు కట్ చేసి ఎమ్మెల్యే కు తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షురాలు, జయశంకర్ భూపాలపల్లి టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, భూపాలపల్లి టీఆర్ఎస్ పార్టీ టౌన్ మాజీ అధ్యక్షుడు క్యాతరాజు సాంబమూర్తి, కౌన్సిలర్లు శిరూప అనిల్, నాయకులు నాగుల రాజిరెడ్డి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ జనరల్ సెక్రటరీ ఈగ రవి కిరణ్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement