Friday, April 26, 2024

గిరిజనులకు వైద్యం ఇబ్బంది రాకుండా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి – మంత్రి సత్యవతి రాథోడ్

మహబూబాబాద్, – కోవిడ్ మహమ్మారి విజృంభిస్తుండడంతో మారుమూల ప్రాంతాల్లోని గిరిజనులకు వైద్యం ఇబ్బంది రాకుండా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, మహిళలు, గర్భిణీలు, బాలింతల ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశుసంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. కోవిడ్ పరిస్థితులను ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్సు, టెలి కాన్ఫరెన్సుల ద్వారా పర్యవేక్షిస్తూ, కోవిడ్ వార్డులను సందర్శిస్తూ ముఖ్యమంత్రి కేసిఆర్ గారి ఆలోచన మేరకు రోగులకు ధైర్యాన్ని అందిస్తున్నారు. నేడు మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్సు నిర్వహించి కోవిడ్ పరిస్థితులను తెలుసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement