Friday, April 26, 2024

హ్యాట్సాఫ్ పోలీస్.. ఆపదలో ఆపన్న హస్తం

లాక్‌డౌన్‌ పరిస్థితుల వేళ పోలీసులు ఆపదలో ఉన్నవారికి బాసటగా నిలుస్తున్నారు. కరోనా సమయంలో రక్త కోరతతో పేషేంట్లు ఇబ్బందులు పడుతున్నారు. మరోపక్క వ్యాక్సినేషన్ తో రక్తదానం చేయడానికి ప్రజలు ముందుకు రాలేకపోతున్నారు. దీంతో బ్లడ్ బ్యాంక్ లలో బాధితులకు కావాల్సిన రక్తం అందుబాటులో లేకుండా పోతుంది. వాట్సప్ గ్రూపులలో భారీగా రక్తం కోసం వినతులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఒక మహిళ డెలివరీ సమయంలో రక్తం అత్యవసరంగా కావాలని శనివారం తెల్లవారుజామున పోలీస్ శాఖకు చెందిన బాధితురాలి భర్త వాట్సాప్ ద్వారా అభ్యర్దించాడు. దీనితో స్పందించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ పేషేంట్ కు రక్తదానం చేశాడు. ప్రమాదం బారిన పడి అత్యవసర సమయంలో రక్తదానంలో ముందుటున్నాడు ఈ కానిస్టేబుల్. ఇప్పటికే 27సార్లు రక్తదానం చేసి ఎందరో పేషేంట్లకు రక్తం అందించాడు. రమేష్ సేవాగుణం పట్ల పలువురు ప్రశంసించారు. రక్తం కోసం ఎవ్వరు కావాలని అడిగిన తాను ముందుండి రక్తదానం పట్ల అవగాహన కల్పిస్తున్నాడు ఈ కానిస్టేబుల్ రమేష్.

Advertisement

తాజా వార్తలు

Advertisement