Friday, June 18, 2021

వన్నూరమ్మ – నువ్ గ్రేట్ – ప్రధాని మోడి

అనంతపురం, : ప్రకృతి వ్యవసాయంలో దేశానికి అనంతపురం జిల్లా ఆదర్శమని, వన్నూరమ్మ లాంటి మహిళా రైతులు దేశానికి ఆదర్శమని అనంతపురం జిల్లాను, వన్నూరమ్మను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అభినందిం చారు. ఒంటరి దళిత మహిళ ప్రకృతి వ్యవసాయం చేసి పెట్టు-బడి మీద నికరం నాలుగు రెట్లు- ఆదాయం సంపాదిస్తోందని, అందరూ ఇలాంటి పద్ధతులనే అనుసరిస్తే రాష్ట్రం, దేశం మొత్తం సస్యశ్యామలం అవుతుందని ప్రధాన మంత్రి సూచించారు. న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శుక్రవారం ఉదయం పి.యం. కిసాన్‌ ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి. 2021 – 22 పథకాన్ని ప్రధాని మోడీ ప్రారంభించగా, ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా మహిళా రైతు వన్నూరమ్మ తో దేశ ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఐదారుగురితో ప్రధాని మాట్లాడితే అందులో అనంతపురం జిల్లా మహిళా రైతు వన్నూరమ్మను ప్రధానమంత్రి కార్యాలయం ఎంపిక చేసుకుంది. కళ్యాణదుర్గం మండలం దురదకుంట గ్రామా నికి చెందిన మహిళా రైతు వన్నూరమ్మ మాట్లాడింది. ఆమె మాటల్లో.. నమస్కారం సర్‌ ….. నా పేరు వన్నూరమ్మ. మీతో మాట్లాడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ప్రభుత్వం నాలుగు ఎకరాల అసైన్డ్‌ భూమి ఇచ్చింది. ఆ భూమి పదేళ్ల నుంచి బంజరు భూమిగా ఉంది. ఆ భూమిని ప్రకృతి వ్యవసాయం కోసం మార్చుకుని, 2 ఎకరాలలో ప్రకృతి వ్యవసాయం చేశాను. ఒక ఎకరానికి మూడు పంటలు పండించాను. అందులో నవధాన్యాలు, వేరుశనగ, కూరగాయలు వేశాను సర్‌ అని తెలిపింది. 3 పంటలకు కలిపి నాకు పెట్టు-బడి 27 వేల రూపాయలు అయింది. ఒక ఎకరాకి ఒక లక్షా 7 వేల రూపాయల లాభం వచ్చింది. మాకు వర్షపాతం తక్కువగా ఉంది. కాబట్టి భూమిని అభివృద్ధి చేసుకుని ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం. నేను ఒక ఎస్సీ ఒంటరి మహిళను. మా గ్రామం పక్కన ఒక తాండా ఉంది. ఆ తండాలో 170 మంది గిరిజన మహిళలు ఉన్నారు. నేను ఎలా అయితే ప్రకృతి వ్యవసాయం చేశానో అలా వారికి కూడా ప్రకృతి వ్యవసాయం గురించి నేర్పించి వారిని కూడా ప్రకృతి వ్యవసాయం చేసేలా ప్రోత్సహించాను. మీతో మాట్లాడినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని తెలిపింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ వన్నూరమ్మజీ మీరు చేసిన పని చాలా ప్రోత్సాహకరంగా ఉంది.
కలెక్టర్‌ అభినందనలు
ప్రధాన మంత్రి తో మాట్లాడిన మహిళా రైతు వన్నూరమ్మను జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు ప్రత్యేకంగా అభినందించారు. పీఎం కిసాన్‌ ప్రారంభ కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్‌ చాంబర్లో మహిళా రైతుతో జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఒంటరి దళిత మహిళా రైతు ప్రకృతి వ్యవసాయం చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. మహిళా రైతు వన్నూరమ్మను ఆదర్శంగా తీసుకుంటే జిల్లా అంతా పచ్చగా మారుతుందన్నారు. ఆత్మ్థసర్యం, మీ మీద మీకు నమ్మకం ఇదే మిమ్మల్ని కాపాడిందని, ఇది చాలా అద్భుతమని, భర్త చనిపోయినా ఒంటరి మహిళ వన్నూరమ్మ నలుగురు పిల్లలతో ఇలా కష్టపడి పైకి రావడం చాలా గొప్ప విషయమన్నారు. కష్టపడే వారిలో ఆత్మ్థసర్యం ఉంటు-ందని, ఎలాంటి బెణుకు లేకుండా చకచకా మాట్లాడటం చూస్తే మీ కష్టం అందులో కనబడుతోందన్నారు. ఇలాంటి మహిళలు దేశానికే ఆదర్శం అని, మీరు ఇతరులకు సహాయం చేస్తుండటం చాలా గొప్ప విషయమన్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News