Saturday, May 18, 2024

జూలై 28 నుంచి అమరవీరుల వారోత్సవాలు

భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు

వరంగల్ : ప్రజాయుద్ధంలో ప్రాణాలర్పించిన మృత వీరుల స్మృతులను యాది చేసుకుందాం. త్యాగ ధనుల ఆశయాల పల్లకిని మోసే బోయిలం అవుదాం. అమరుల స్వప్నాలను నిజం చేయడానికి ప్రజా యుద్ధానికి అంకితమవుదామని సీపీఐ మావోయిస్టు రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పిలుపునిచ్చారు. జులై 28 నుండి ఆగస్టు 3 వరకు గ్రామాల్లో, పట్టణాల్లో అమర వీరుల సభలు జరుపుకొందామన్నారు. కా. చారుమజుందర్ అమరత్వం 50 ఏళ్లు. కా.కన్సయ్ చటర్జీ అమరత్వం 40 ఏళ్ల సందర్భంగా గొప్ప విప్లవ స్ఫూర్తితో, విస్తవ సంకల్పంతో కార్యక్రమాను నిర్వహించండి అని పిలుపునిచ్చారు.

మన పార్టీ విప్లవ దినాల్లో జులై 28 విశేషమైన దినం. ప్రతి యేడు ఈ రోజున ప్రజా యుద్ధంలో అమరులయినా వీరులను, వీర వనితలను సర్మించుకుంటున్న విషయం మనందరికి తెలిసిందే. మన దేశ నిరిష్ట పరిస్థితులకు దీర్ఘకాలిక ప్రజా యుద్ధ మార్గాన్ని చూపిన మన పార్టీ సంస్థాపకులు, ఉపాధ్యాయులు కా. చారుమజుందార్, కా. కన్హయ్ చటర్జీల అమరత్వాన్ని పురష్కరించుకొని జులై 28 నుండి ఆగస్టు 3వరకు ఈ ప్రత్యేక దినాన్ని జరుపుకుంటున్నాము. రివిజనిజాన్ని బద్దలు కొట్టిన నగ్జల్బరీ పోరాట సాంప్రదాయాలను, ప్రతిష్టను ఎక్కడ దెబ్బతీయకుండా ప్రియతమ నేతలు అందించిన వజ్ర సంకల్పం, చైతన్యంతో నిండిన యవతి, యవకులు మావోయిస్టు పార్టీ నాయకత్వంలో ఈ దేశ విముక్తి కోసం, నూతన సమాజ నిర్మాణం కోసం తమ నెత్తురు చిందించారు. మన దేశమే కాదు, ప్రపంచ ప్రజల విముక్తి కోరిన గొప్ప త్యాగధనులను ఈ రోజున మననం చేసుకుందాం అని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలునిచ్చింది.

- Advertisement -

భూస్వామ్యం, బడా పెట్టుబడి దారులు, సామ్రాజ్యవాద దోపిడిలో నలుగుతున్న పీడిత ప్రజలు, జాతులు, తమ విముక్తి కోసం, సోషలిజాన్ని నిర్మించుకొని అంతిమంగా కమ్యూనిజాన్ని స్థాపించడం కోసం నిజమైన కార్మిక వర్గ పార్టీ ఎర్ర జెండా క్రింద ఈ దోపిడి వ్యవస్థకు సమాధి కట్టే లక్ష్యంతో పీడిత ప్రజలంతా ఐక్యమై, సాయుధ పోరాట మార్గంలో కదం తొక్కుతున్నారు. ఈ ప్రవాహాన్ని అడ్డుకోవడానికి దోపిడి పాలకులు కౄరమైన వ్యూహాత్మక సమాధాన్ దాడిని అమలు చేస్తున్నారు. శతృవు పాశవిక దాడిని ఓడించడానికి సమరశీల పోరాటాలు చేపట్టి కేంద్ర కమిటీ నుండి మొదలు రాష్ట్ర, జిల్లా, ఏరియా, గ్రామ స్థాయి పార్టీ కమిటీల నాయకత్వం, పిఎల్డీఏ కమాండర్లు, సభ్యులు సాధారణ ప్రజల వరకు ఈ ప్రజా యుద్దలో విరోచితంగా పోరాడుతూ వేలాది మంది ప్రాణాలర్పించారు. ఈ సంవత్సర కాలంలో దేశ వ్యాప్తంగా దాదాపు 160 మందికి పైగా కామ్రేడ్స్ అమరులయ్యారు. ఇందులో ఆకాశంలో సగం పోరుల్లో | సగమంటూ ప్రజల రాజ్యధికారం కోసం సాగే మహత్తర పోరాటంలో భాగమై ప్రాణాలర్పించిన వీరంగనాలెందరో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement