Tuesday, April 30, 2024

ఆటో కార్మిక యూనియ‌న్ల భారీ ర్యాలీ…

నర్సంపేట : నేడు ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని TADU & నవ తెలంగాణ ఆటో యూనియన్ TRSKV (అనుబంధం) వారి ఆధ్వర్యంలో నర్సంపేట ఆర్అండ్ బి గెస్ట్ హౌస్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సంపేట శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించడం జరిగింది. అనంతరం నర్సంపేట పట్టణంలోని ఆటో కార్మికులందరితో కలిసి కేక్ కట్ చేసుకొని వేడుకలు జరుపుకుని శుభాకాంక్షలను తెలియచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు, పార్టీ ముఖ్య నాయకులు, TRSKV రాష్ట్ర నాయకురాలు, జిల్లా అధ్యక్షులు & నాయకులు, ఆటో యూనియన్ అధ్యక్షులు, TADU యూనియన్ నాయకులు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, ఆటో కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement