Monday, May 6, 2024

ప్రతి గ్రామంలో బాలల రక్షణ కమిటీల ఏర్పాటు : మంత్రి ఎర్రబెల్లి

గ్రామ స్థాయిలోనే బాలలను రక్షించాలని ప్రభుత్వం గ్రామ స్థాయి కమిటీలను ఏర్పాటు చేసిందని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన గ్రామ బాలల రక్షణ అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బాలల రక్షణ కర దీపికను ఆవిష్కరించి మాట్లాడారు. రాష్ట్రంలోని 12,769 గ్రామాల్లో కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. ఇంకా కొన్ని గ్రామాల్లో కమిటీలు వేయాల్సి ఉంది. కమిటీలో సర్పంచ్ చైర్మన్‌గా, అంగన్‌వాడీ టీచర్ కన్వీనర్‌గా, గ్రామ స్కూల్ హెడ్ మాస్టర్, ఎంపీపీ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారని ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement