Sunday, April 28, 2024

Mulugu: తునికాకు బోనస్ చెల్లించాలని ఫారెస్ట్ కార్యాలయం ముందు ధర్నా

వాజేడు, ఆగస్టు 1 ప్రభ న్యూస్: ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలోని బీట్ ఆఫీసర్ కార్యాలయాన్ని సోమవారం వ్యవసాయ కార్మిక సంఘం, ఆదివాసీ గిరిజన సంఘం అద్వర్యంలో ముట్టడించి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం బీట్ అధికారి మడప వాసుకి వినతిపత్రం అందజేశారు. నిధులు మంజూరు అయినా పంపిణీలో ఫారెస్ట్ అధికారులు జాప్యం చేస్తున్నారని ఆదివాసీ గిరిజన సంఘం సాధించిన బోనస్ డబ్బులు చెల్లించటంలో కూడా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎండీ దావుద్ మాట్లాడుతూ అన్నారు. 2016 నుండి తునికాకు కార్మికులకు ఇవ్వాల్సిన రూ.250కోట్లు చెల్లించకుండా కాలయాపన చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు తప్ప బోనస్ చెల్లించటం లేదని పోరాడి సాధించుకున్న బోనస్ కూడా చెల్లించుటకు ఫారెస్ట్ అధికారులకు చేతకావటం లేదన్నారు. కొన్ని జిల్లాలలో బోనస్ చెల్లించినప్పటికి, ములుగు జిల్లాలో జాప్యం జరుగుతుందని, కార్మికులు ఎర్రటి ఎండను లెక్కచేయకుండా కొండలను ఎక్కి తునికాకు సేకరిస్తే తునికాకుకు ఇవ్వాల్సిన బోనస్ డబ్బులు మాత్రం ఇవ్వకుండా వారి శ్రమను గుర్తించకుండా నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారన్నారు.

సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కొప్పుల రఘుపతిరావు మాట్లాడుతూ.. బోనస్ చెల్లించకుండా జాప్యం చేస్తే, సిపిఎం అద్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని, బీఆర్ఎస్ ప్రభుత్వానికి పేద ప్రజల పట్ల సవతితల్లి ప్రేమ ఉందని, ఇవ్వటం ఎలాగూ చేతకాదు, పోరాడి సాధించుకున్న డబ్బులు కూడా బ్యాంకు ఖాతాలో జమచేయకుండా నిర్లక్ష్యంగా ఉన్నారని, వెంటనే జమ చేయాలని, లేని యడల డీ ఎప్ వో కార్యాలయాన్ని ముట్టడిస్తామన్నారు. ఈకార్యక్రమంలో గిరిజన సంఘం మండల కార్యదర్శి జజ్జరీ దామోదర్, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి బచ్చల కృష్ణబాబు, నాయకులు గుగ్గిళ్ల దేవయ్య, పెదం రమాదేవి, తోలేం ముత్తయ్య, పాయం కుమారి, తుమ్మ దేవేంద్ర, అంగాల వెంకటస్వామి, గొంది సీత, దుబ్భా లలిత, లంజపల్లి సమ్మలు, బత్తుల సంతోష్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement