Sunday, April 28, 2024

Sports | బీడ‌బ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌లో భార‌త ష‌ట్ల‌ర్ల హ‌వా.. ప్ర‌ణ‌య్‌, ల‌క్ష్య‌సేన్ దూకుడు!

బీడ‌బ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్ లో భార‌త స్టార్ ష‌ట్ల‌ర్లు హెచ్ఎస్ ప్ర‌ణ‌య్, ల‌క్ష్య‌సేన్ స‌త్తా చాటారు. ఈ సీజ‌న్‌లో అత్తుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న చేస్తున్న ప్ర‌ణ‌య్ 9వ స్థానంలో, ల‌క్ష్య‌సేన్ 11వ‌ ర్యాంకుకు ఎగ‌బాకారు. ఈమ‌ధ్యే ముగిసిన జ‌పాన్ ఓపెన్ సూప‌ర్ 750 బ్యాడ్మింట‌న్ టోర్నీలో ఈ స్టార్ ఆట‌గాళ్లు ఇద్ద‌రూ అద‌రగొట్టారు. ల‌క్ష్య‌సేన్ ఏకంగా సెమీస్‌కు దూసుకెళ్లాడు.

మ‌రో భార‌త స్టార్ ష‌ట్ల‌ర్ కిదాంబి శ్రీ‌కాంత్ ఒక అడుగు ముందుకేశాడు. ప్ర‌స్తుతం అత‌ను 19వ ర్యాంక్‌లో ఉన్నాడు. నేష‌న‌ల్ చాంపియ‌న్ మిధున్ మంజునాత్ ఏకంగా 4 స్థానాలు ఏగ‌బాకి 50వ ర్యాంక్ సాధించాడు. ఒలింపిక్ మెడ‌లిస్ట్ పీవీ సింధు మ‌హిళ‌ల ర్యాంక్సింగ్స్‌లో 17వ స్థానంలో ఉంది. ఈ ఏడాది ఆడిన ప్ర‌తీ టోర్న‌మెంట్‌లో క్వార్ట‌ర్స్ కూడా దాట‌లేక‌పోయిన సింధూ గ‌త ప‌దేళ్ల‌లో ఇదే త‌క్కువ ర్యాంక్ కావ‌డం గ‌మ‌నార్హం.

మ‌హిళ‌ల డ‌బుల్స్‌లో..
డ‌బుల్స్‌లో ఇర‌గ‌దీస్తున్న సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టీ రెండో సీడ్ నిల‌బెట్టుకున్నారు. ఈ ఏడాది వీళ్లు కొరియా ఓపెన్‌తో క‌లిపి మూడు వ‌ర‌ల్డ్ టూర్ టైటిళ్లు సాధించారు. దీంతో ఈమ‌ధ్యే మూడో ర్యాంక్ నుంచి రెండో ర్యాంకుకు ఎగ‌బాకారు. మ‌హిళ‌ల డ‌బుల్స్‌లో త్రీసా జాలీ, గాయ‌త్రీ గోపిచంద్ 17వ ర్యాంక్ సొంతం చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement