Thursday, May 2, 2024

వరద ఎఫెక్ట్… బొగత సందర్శన నిలుపుదల

వాజేడు, జులై 19 ప్రభ న్యూస్ : గత మూడు రోజులుగా జోరుగా కురుస్తున్న వర్షాల కారణంగా ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని చీకుపల్లి బొగత జలపాతం లోయలోకి అత్యధికంగా వరదనీరు చేరడంతో బొగత జలపాతం ఉధృతంగా ప్రవహిస్తూ ఉగ్రరూపం దాల్చింది. దీంతో ప్రమాదాలు సంభవిస్తాయని పసిగట్టిన అటవీశాఖ అధికారులు, ములుగు జిల్లా అధికారి ఆదేశాల మేరకు బొగత జలపాతం సందర్శన బుధవారం ఉదయం నుండి నిలుపుదల చేసినట్లు రేంజర్ చంద్రమౌళి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement