Tuesday, April 30, 2024

బ్యూటిషియన్ ఫ్రీ ట్రైనింగ్ క్లాసెస్.. ప్రారంభించిన ఎమ్మెల్యే అరూరి

వర్ధన్నపేట, (ప్రభ న్యూస్): ఐనవోలు మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో డిఆర్ డిఏ వారి సహకారంతో బ్యూటిషియన్ ఉచిత శిక్షణ తరగతులను వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ ప్రారంభించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు, యువతులు శిక్షణతో, స్వయం ఉపాధి రంగాలలో ఆర్థిక పరిపూష్టి సాధించగలుగుతారని ఎమ్మెల్యే అరూరి రమేష్ తెలిపారు. అందులో భాగంగ అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ద్వారా మహిళలకు కుట్టు మిషన్, బ్యూటిషియాన్ వంటి స్వయం ఉపాధి రంగాలలో ఉచిత శిక్షణ అందించడంతో పాటు వారికీ ఉపాధి అవకాశాలు అందిస్తున్నామని తెలిపారు. ఐనవోలు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బ్యూటిషియన్ ఉచిత శిక్షణ తరగతులను మహిళలు, యువతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు, మండల నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement