Friday, May 3, 2024

TS : బల్దియా కమిషనర్‌గా అశ్విని తానాజీ వాకాడే…

వరంగల్, మార్చి 14 (ప్రభ న్యూస్): వరంగల్ మహా నగర పాలక సంస్థ కమిషనర్ గా అశ్విని తానాజీ వాకడేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. 2019 ఐఏఎస్ బ్యాచ్ కి చెందిన అశ్విని తానాజీ ప్రస్తుతం వరంగల్ జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ గా పని చేస్తున్నారు.

- Advertisement -

ఇంఛార్జ్ కమిషనర్ గా ప్రస్తుతం వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య స్థానంలో అశ్విని తానాజీ బాధ్యతలు చేపట్టనున్నారు. బల్దియా కమిషనర్ గా ఉన్న రిజ్వాన్ భాషా ఇటీవల జనగాం జిల్లా కలెక్టర్​గా బదిలీ కావడంతో కమిషనర్ స్థానం ఖాళీ ఏర్పడింది. ఆ స్థానంలో పూర్తిస్థాయి కమిషనర్​గా ఐఏఎస్ అశ్విని తానాజీ వాఖాడే జాయిన్ అవ్వనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement