Friday, April 26, 2024

మేడిపల్లిలో గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధం

వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం మేడిపల్లి గ్రామంలో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధమైన సంఘటన చోటు చేసుకుంది. ఇంటి యజమాని ఆకారపు సమ్మక్క.. కూలి పనులకు వెళ్లిన తరువాత ఈ ఘటన జరిగినట్లు సమాచారం. భారీగా మంట‌లు వ్యాపించ‌డంతో ఇంట్లోని స‌మ‌గ్రి మొత్తం మంట‌ల్లో కాలిపోయింది. చుట్టు ప‌క్క ప్రజలు మంట‌ల‌ను ఆర్పివేశారు. బాధిత కుటుంబానికి తహశీల్దార్ మంజుల 50 కేజీల బియ్యం అందజేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement