Friday, May 17, 2024

కనులపండుగగా శివరాత్రి జాగరణ ఉత్సవాలు

తొర్రూరు పట్టణంలో మహాశివరాత్రి సందర్భంగా గురువారం రాత్రి శ్రీ పార్వతి సారంగేశ్వరశ స్వామి కళ్యాణం మహోత్సవం అనంతరం వివేకానంద ఆడిటోరియంలో శ్రీ సూర్య సేవా సంస్థ ఆధ్వర్యంలో శివరాత్రి జాగరణ ఉత్సవాలు కనులపండుగగా నిర్వ హించారు. జిల్లా కేంద్రానికి చెందిన తాండవ కృష్ణ డాన్స్ అకాడమీ వారి చిన్నారుల కూచిపూడి భరత నాట్య ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం జరిగిన భక్తి సంగీత విభావరిలో శివ నామస్మరణ అయ్యప్ప ,సాయి బాబా,శ్రీ వెంకటేశ్వర స్వామి సుబ్రహ్మణ్యం ,అమ్మవారి పాటలను ఎంతో శ్రావ్యంగా ఆలపించారు. శివరాత్రి జాగరణ మహత్యా న్ని తెలుపుతూ సుమధుర భక్తి గీతాలను ఆలపించారు. ఈ కార్యక్రమం తెల్లవారుజా మున నాలుగు గంటల వరకు కొనసా గింది. భక్తులు భక్తి పారవశ్యం తో జాగరణ పూర్తి చేసుకుని, అనంతరం ఆలయంలో జరిగిన అభిషేక కార్యక్రమాల్లో పాల్గొని తరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ బాధ్యులు కొనగంటి కృపాకర్ రాజు, సుంకర నేని పినాకపాణి లేగల వెంక టరెడ్డి , గాయకులు మండ వీరస్వామి, రంగనాథ్ కళ్యా ణ్ రామ్, సురేష్, యాకయ్య ,మధు జనార్ధన చార్యులు స్వామి వివేకానంద యువజన సంఘం పూర్వ అధ్యక్షులు తల్లాడ హిరాధర్ తెలంగాణ సామాజిక రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు, కవి ఇమ్మడి రాంబాబు తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement