Monday, May 6, 2024

రేపటి నుండి వాలీబాల్ పోటీలు

పెద్ద‌ప‌ల్లి : సబ్ డివిజన్ స్థాయి వాలీబాల్ పోటీలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని పెద్దపెల్లి ఏసీపీ సారంగపాణి పేర్కొన్నారు. ఈరోజు స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయ‌న‌ మాట్లాడుతూ…. శనివారం ఉదయం 9 గంటలకు పోటీలు ప్రారంభమ‌వుతాయని, రెండు రోజులపాటు కొనసాగుతాయన్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి లు పోటీలను ప్రారంభిస్తారన్నారు. సబ్ డివిజన్ పరిధిలోని ఏడు పోలీస్ స్టేషన్ల నుండి రెండేసి జట్లు పాల్గొంటాయన్నారు.

క్రీడాకారులు క్రీడాస్ఫూర్తి కనబరచాలని, గెలుపోటములను సమానంగా తీసుకోవాలన్నారు. విజేతలకు నగదు బహుమతితో పాటు మెమొంటోలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐలు ప్రదీప్ కుమార్, ఇంద్రసేనారెడ్డి, అనిల్, ఎస్ఐలు రాజేష్, వెంకటేష్, జానిపాష, లక్ష్మణ్, శ్రీనివాస్, మహేందర్, ఉపేందర్ తో పాటు పలువురు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement