Sunday, May 5, 2024

రామానుజాచార్యుల సహ‌స్రాబ్ది ఉత్స‌వాల్లో విష్ణు స‌హ‌స్ర‌నామా పారాయ‌ణం.. పాల్గొన్న కేసీఆర్ స‌తీమ‌ణి

ముచ్చింతల్‌లో సమతామూర్తి శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 12 రోజులపాటు నిర్వ‌హించే ఈ మహాక్రతువు మూడో రోజుకు చేరుకున్నది. ఉత్సవాల్లో భాగంగా యాగశాలలో లక్ష్మీనారాయణ యాగాన్ని ఈరోజు ఉద‌యం నిర్వ‌హించారు. కాగా, సాయంత్రం ప్ర‌వ‌చ‌న మండపంలో విష్ణు స‌హ‌స్ర‌నామ పారాయ‌ణం చేశారు. విష్ణు స‌హ‌స్ర‌నామ పారాయ‌ణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స‌తీమ‌ణి శోభ‌తో పాటు ఆయ‌న కుటుంబ స‌భ్యులు పాల్గొన్నారు. కార్య‌క్ర‌మంలో పెద్ద‌ ఎత్తున భ‌క్తులు పాల్గొని పారాయ‌ణం ప‌ఠించారు.

ఇవ్వాల‌ సాయంత్రం 6గంట‌ల‌ నుంచి 7 గంట‌ల వ‌ర‌కు సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్నారు. 7 నుంచి 7:30 గంట‌ల వ‌ర‌కు అతిథుల‌కు స‌న్మానాలు, ఆశీర్వ‌చ‌నాలు అందించ‌నున్న‌ట్టు నిర్వాహ‌కులు తెలిపారు. రాత్రి 7:30 నుంచి 8:00 వరకు మ్యాపింగ్‌ వీడియో ప్రదర్శనలు, 8 నుంచి 10 వరకు శ్రీమన్నారాయణుడి భజనలు కొన‌సాగుతాయి..

Advertisement

తాజా వార్తలు

Advertisement