Sunday, April 28, 2024

గ్రామస్థాయి ఉద్యోగులకు పే స్కేల్ అందించిన ఏకైన‌ రాష్ట్రం తెలంగాణ…ఎర్ర‌బెల్లి

జనగామ ఆగస్టు 10 ప్రభ న్యూస్ – దేశంలోనే గ్రామ రెవెన్యూ సహాయకులకు జేపీఎస్ లకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పే స్కేల్ అందజేస్తున్న ఏకైక రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి నీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు గురువారం జనగామ జిల్లా కేంద్రంలోని భ్రమరాంబ కన్వెన్షన్ లో గ్రామ రెవెన్యూ సహాయకులు జెపిఎస్ పంచాయతీ కార్యాలయంలో ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పే స్కేల్ నియామక పత్రాల చేస్తే కార్యక్రమం జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య అధ్యక్షతన జరిగింది కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి నీటి సరఫరాల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొని వారికి నియామక పత్రాలు అందించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలోనూ ఏ రాష్ట్రంలో గ్రామస్థాయి రెవిన్యూ సహాయ ఉద్యోగులకు ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పేస్కేల్ అందించిన రాష్ట్రం అది తెలంగాణ రాష్ట్రమేనని అది కేసిఆర్ తోనే సాధ్యమైందని అన్నారు రాష్ట్రవ్యాప్తంగా గ్రామ రెవెన్యూ సహాయ కార్యదర్శి జేపిఎస్ కార్యదర్శులు మొత్తం 2500 మంది ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారికి పిఎస్కే ఆర్డర్ పత్రాలను ప్రభుత్వం అందజేయడమే కాకుండా మన జిల్లాలో 314 మంది చిరు ఉద్యోగులకు నేడు నియామక పత్రాలు అందజేయడం జరుగుతుందని అన్నారు 70 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో పోలీస్ పట్వారి వ్యవస్థ ఉండేదని వారు ఎంత చెప్తే అంత గ్రామాల్లో ప్రజాస్వామ్యం ఉండే పరిస్థితి కాదని కానీ నాడు నందమూరి తారకరామారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేయడం జరిగిందని అన్నారు.

ఎన్టీఆర్ ఆలోచన విధానంతోనే నేడు గ్రామస్థాయిలో ఎంతో కాలంగా చిరు ఉద్యోగులుగా పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ కార్యదర్శిలను కేసీఆర్ గుర్తించి ప్రభుత్వ ఉద్యోగులుగా వారికి ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతుందని అన్నారు కాంగ్రెస్ పార్టీ కెసిఆర్ పాలన చూసి ఓర్చుకోలేక ప్రభుత్వంపై అబద్ధాల ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రంలో అమలుపరుస్తున్న సంక్షేమ పథకాలు గాని అమలుపరచలేని దౌర్భాగ్య పరిస్థితి కాంగ్రెస్ పార్టీదని అన్నారు. ఒకనాడు కేంద్ర ఉద్యోగులు జీతభత్యాలు అధికంగా ఉండేవని కానీ నేడు తెలంగాణ రాష్ట్రంలో జీతభత్యాలు అత్యధికంగా ఉన్నాయని అందుకు ప్రభుత్వమే ఉద్యోగుల పక్షాన భరోసా తో అందిస్తుందని అన్నారు. భవిష్యత్తులో మరో మారు కెసిఆర్ ప్రభుత్వం కోసం సహకరించాలని ఆయన కోరారు.

అనంతరం కెసిఆర్ చిత్రపటానికి ఉద్యోగస్తులు పూలాభిషేకం కురిపించారు ఈ కార్యక్రమంలో స్టేషన్గన్పూర్ జనగామ శాసనసభ్యులు డాక్టర్ తాటికొండ రాజయ్య ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి జెడ్పీ చైర్మన్ పాకాల సంపత్ రెడ్డి అదనపు కలెక్టర్ లు రోహిత్ సింగ్ సువాసిని డిసిపి సీతారాం గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎడవల్లి కృష్ణారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ పోకల జమున లింగయ్య వ్యవసాయ మార్కెట్ చైర్మన్ సిద్ధి లింగం తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement