Sunday, April 28, 2024

రాములమ్మ రాజకీయ ప్రస్థానానికి 24 ఏళ్లు

ఫైర్ బ్రాండ్ విజయశాంతి రాజకీయాల్లోకి అడుగు పెట్టి నేటితో 24 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. సినిమాల్లో లేడీ సూపర్ స్టార్ ఖ్యాతి సంపాదించిన విజయశాంతి.. అనంతరం రాజకీయాల్లోకి  ప్రవేశం చేశారు. తొలుత బీజేపీలో అనంతరం సొంత ఓ పార్టీ పెట్టారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసి.. 2009లో మెదక్ ఎంపీ అయ్యారు. అనంతరం మారిన రాజకీయ సమీకరణాలతో ఆమె కాంగ్రెస్ పార్టీకి అటు నుంచి మళ్లీ బీజేపీలో చేరారు.

ఈ క్రమంలో విజయశాంతి తన రాజకీయ ప్రస్థానంపై సోషల్ మీడియాలో స్పందించారు. నిన్నటితో తన రాజకీయ జీవితానికి 24 ఏళ్లు పూర్తయ్యాయని వెల్లడించారు. తాను 1998 జనవరి 26న రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. తన రాజకీయ ప్రస్థానం 25వ పడిలోకి ప్రవేశించిన సందర్భంగా తనకు అభినందనలు, శుభాశీస్సులు తెలియజేసిన అభిమానులు, శ్రేయోభిలాషులకు వినమ్రంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాని అన్నారు. మీ అందరి ఆదరాభిమానాలను ఎప్పటికీ ఇలాగే నిలబెట్టుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానని తెలిపారు.

ఇక ఆమె రాజకీయ ప్రస్థానం గురించి చెప్పాలంటే.. విజయశాంతి మొదట బీజేపీలో చేరారు. తదనంతర కాలంలో తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడంతో బీజేపీ నుంచి తప్పుకుని 2005లో తల్లి తెలంగాణ పార్టీ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత నాలుగేళ్లకు తన పార్టీని టీఆర్ఎస్ లో కలిపేశారు. 2009 ఎన్నికల్లో మెదక్ పార్లమెంటు స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచి ఎంపీ అయ్యారు. కొన్ని ప్రతికూల పరిణామాలతో ఆమె టీఆర్ఎస్ పార్టీకి దూరమయ్యారు. 2014లో కాంగ్రెస్ లో చేరిన విజయశాంతి అక్కడా ఇమడలేకపోయారు. 2020లో మళ్లీ బీజేపీ గూటికే చేరారు.

https://twitter.com/vijayashanthi_m/status/1486633570919608322
Advertisement

తాజా వార్తలు

Advertisement