Sunday, April 28, 2024

VH Announce – ఆగస్ట్ లో కాంగ్రెస్ బిసి గర్జన … హాజరుకానున్న రాహుల్, సిద్ద రామయ్య

హనుమకొండ : ఆగష్టు నెలలో నిర్వహించనున్న బిసి డిక్లరేషన్ పై గురువారం హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా ముఖ్య నాయకులు, ఒబిసి జిల్లా కార్యవర్గంతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా టిపిసిసి మాజీ అధ్యక్షులు, రాజ్యసభ మాజీ ఎం.పి వి. హన్మంతరావు హాజరై ప్రసంగించి దిశా నిర్దేశం చేసారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేఖరుల సమావేశంలో వి. హన్మంతరావు మాట్లాడుతూ దేశంలో ఒబిసిలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసింది ఏమే లేదన్నారు. కర్ణాటకలో ఒబిసిలు మైనారిటీలు వోట్లు వేస్తె కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందదన్నారు.


రాష్ట్రంలో సిఎం కేసిఆర్ కులాల వారిగా సర్వే చేసి ఎందుకు బయట పెట్టడం లేదని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి బరకు బిసి బడ్జెట్ పెట్టలేదని అన్నారు. టిఆర్ఎస్ నుండి బిఆర్ఎస్ గా మారినప్పుడే ఇక్కడి ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడుగు బలహీన వర్గాలకు ఒరగబెట్టింది ఏమి లేదని, కేసిఆర్ ఎన్నికల్లో హామీలో ముస్లిం మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్ కలిపిస్తానని హామీ ఇచ్చిందని, ఇచ్చిన హామీ ఇవ్వకపోగా గతంలోకాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలకు కల్పించిన 4 శాతం రిజర్వేషన్ కూడా బిఆర్ఎస్ ప్రభుత్వం తొలగించాలని చూస్తుందని అన్నారు.


తెలంగాణాలో రైతే రాజు అన్న కే.సి.ఆర్ నువ్వు ఖమ్మంలో రైతుల పండిన పంటకు సరైన ధర కల్పించండి అని ధర్నా చేస్తే రైతులకు బేడీలు వేసి జైల్లో కూర్చో పెడుతావా అని ప్రశ్నించారు. ఆగ‌స్ట్ లో బిసి గ‌ర్జ‌న నిర్వ‌హించ‌నున్నామ‌ని, ఈ గ‌ర్జ‌న‌లో రాహుల్ గాంధీ, మ‌ల్లిఖార్జున ఖ‌ర్గేలు పాల్గొన‌నున్నార‌ని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అద్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి, మాజీ ఎం.పి. సిరిసిల్ల రాజయ్య, పరకాల నియోజకవర్గ బాధ్యులు ఇనగాల వెంకట్రాం రెడ్డి, వర్ధన్నపేట నియోజకవర్గ బాధ్యులు నమిండ్ల శ్రీనివాస్, టిపిసిసి కార్యదర్శి ఈ.వి. శ్రీనివాస్ రావు, కార్పొరేటర్ తోట వెంకటేశ్వర్లు, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, బంక సరళ, జిల్లా ఒబిసి డిపార్టుమెంటు చైర్మన్ బొమ్మతి విక్రం, జిల్లా మైనారిటీ సెల్ చైర్మన్ మిర్జా అజీజుల్లా బేగ్, గుంటి స్వప్న, NSUI జిల్లా అధ్యక్షుడు పల్లకొండ సతీష్, యువజన జిల్లా ఉపాధ్యక్షుడు అలువల కార్తిక్, ఒబిసి రాష్ట్ర నాయకులు తౌటం రవీందర్, పులి రాజు, బండారి జనార్ధన్ గౌడ్, ఇప్పా శ్రీకాంత్, నల్ల సత్యనారాయణ, బంక సంపత్ యాదవ్, ముప్పిడి శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement