Thursday, May 2, 2024

ఎమ్మెల్సీ స్థానానికి వాణీదేవి నామినేష‌న్..

హైద‌రాబాద్ : మ‌హ‌బూబ్ న‌గ‌ర్ – రంగారెడ్డి – హైద‌రాబాద్ ప‌ట్ట‌భ‌ద్రుల స్థానానికి టీఆర్ఎస్ అభ్య‌ర్థి సుర‌భి వాణీదేవి నామినేష‌న్ దాఖ‌లు చేశారు. జీహెచ్ఎంసీ ప్ర‌ధాన కార్యాల‌యంలో నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి, జీహెచ్‌ఎంసీ అడిషనల్‌ కమిషనర్‌ ప్రియాంక అల‌కు నామినేష‌న్ ప‌త్రాల‌ను వాణీదేవి స‌మ‌ర్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. అంతకు ముందు ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్‌తో సుర‌భి వాణీదేవి, హైద‌రాబాద్‌, ఉమ్మ‌డి రంగారెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాల టీఆర్ఎస్ నేత‌లు స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌పై వారికి సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ ఎన్నిక‌ల్లో గెలుపున‌కు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై చ‌ర్చించారు. అనంత‌రం వాణీదేవికి కేసీఆర్ బీ ఫార్మ్ అంద‌జేశారు. బీ ఫార్మ్ అందుకున్న వాణీదేవి ప్ర‌గ‌తి భ‌వ‌న్ నుంచి నేరుగా గ‌న్‌పార్క్‌కు చేరుకున్నారు. అక్క‌డ అమ‌రవీరుల స్థూపానికి నివాళుల‌ర్పించారు. అటు నుంచి జీహెచ్ఎంసీ ప్ర‌ధాన కార్యాల‌యానికి వెళ్లి నామినేష‌న్ ప‌త్రాల‌ను స‌మ‌ర్పించారు వాణీదేవి. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్‌తో భేటీ కంటే ముందు నెక్లెస్ రోడ్డులోని పీవీ జ్ఞాన‌భూమి వ‌ద్ద వాణీదేవి పుష్ప‌గుచ్ఛం ఉంచి నివాళుల‌ర్పించారు. వాణీదేవి వెంట రాజ్య‌స‌భ స‌భ్యులు కే కేశ‌వ‌రావు, మంత్రులు త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌, నిరంజ‌న్ రెడ్డి, స‌బితా ఇంద్రారెడ్డి, ప‌లువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement