Friday, April 19, 2024

‘కవిత’ని కలిసిన ‘అక్షర’ చిత్రయూనిట్

హీరోయిన్ గా నందితాశ్వేత నటిస్తోన్న చిత్రం అక్షర. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంఎల్ సీ కవితని అక్షర చిత్ర బృందం కలిసింది. ఈ సినిమా విశేషాల్ని దర్శకనిర్మాతలు కవితతో పంచుకున్నారు. సినిమా కాన్సెప్ట్‌ నచ్చడంతో యూనిట్‌ను కవిత ప్రశంసించడంతో పాటు ఈ నెల 23న జరుగనున్న చిత్ర ప్రీరిలీజ్‌ వేడుకకు హాజరవుతానని చెప్పారు. కవితను కలిసినవారిలో చిత్ర దర్శకుడు చిన్నికృష్ణ, నాయిక నందితా శ్వేత, నిర్మాతలు సురేశ్‌ వర్మ, అహితేజ ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement