Monday, April 29, 2024

TSRTC – టికెట్ ధ‌ర‌లు పెంచిన టిఎస్ఆర్టీసీ

హైద‌రాబాద్ – టిఎస్ఆర్టీసీ టికెట్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సిటీ బస్సుల్లో 24 గంటల పాటు ప్రయాణించేందుకు వెసులుబాటు కల్పించే T-24 టికెట్ ధరలు పెరిగాయి. ఈ టికెట్ ధర సాధారణ ప్రయాణికులకు రూ.90 నుంచి రూ.100కి పెంచారు. ఇక సీనియర్ సిటిజన్లకు టికెట్ ధర ప్రస్తుతం రూ.80 నుంచి రూ.90కి పెంచారు. ఈ మేరకు ఆర్టీసీ ఈడీ ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన ధరలు జూన్ 16 నుంచి జూలై 31 వరకు అమల్లో ఉంటాయని టీఎస్‌ఆర్టీసీ అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గతంలో సాధారణ ప్రయాణికులకు రూ.100గా ఉన్న టీ-24 టికెట్ ధర ఏప్రిల్ 26న రూ.90కి తగ్గించారు.80 సీనియర్ సిటిజన్స్ కోసం. తాజా నిర్ణయంతో పాత ధరలు అమల్లోకి రానున్నాయి.

కాగా.. ప్రయాణికులకు చేరువయ్యేందుకు టీఎస్‌ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్డినరీ బస్సుల్లోనూ వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ (వీటీఎస్) అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. ఈ సదుపాయాన్ని తీసుకోవడం ద్వారా ప్రయాణికులు బస్సు వచ్చే సమయాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా తిరిగే 900 మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఈ విధానాన్ని ఇప్పటికే ప్రవేశపెట్టారు. ఇప్పుడు అన్ని సిటీ బస్సుల్లో తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తే మొబైల్ యాప్ ద్వారా ప్రయాణికులు బస్సు సమయాలు, వివరాలు, బస్టాప్‌కు చేరుకోవడానికి ఎంత సమయం పడుతుందో ముందుగానే తెలుసుకోవచ్చు. ఈ వ్యవస్థ ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. తద్వారా బస్టాప్‌ల వద్ద వేచి ఉండాల్సిన అవసరం లేదు. అయితే త్వరలో ఈ వ్యవస్థ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement