Tuesday, April 30, 2024

ఆహా కోసం బ‌న్నీ.. శ్రీలీల‌.. పోస్ట‌ర్ రిలీజ్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో న‌టించే ఛాన్స్ ని ద‌క్కించుకుంది యంగ్ హీరోయిన్ శ్రీలీల‌. ఇప్పటికే పవన్‌ కళ్యాణ్‌, మహేష్‌, బాలకృష్ణ వంటి స్టార్లతో కలిసి నటిస్తున్న శ్రీలీలకి ఇప్పుడు బన్నీతోనూ వర్క్ చేసే ఛాన్స్ రావడం, అది ఆమె పుట్టిన రోజు సందర్భంగా ప్రకటన రావడం విశేషమం. ఆహా ఓటీటీ సంస్థ కోసం బన్నీ, శ్రీలీల కలిశారు. వీరిని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ డైరెక్ట్ చేస్తుండటం విశేషం. అయితే ఆహా ఒరిజినల్‌ కోసం వీరిద్దరు కలిసినట్టు టీం తెలిపింది. తాజాగా ఈ విషయాన్ని ప్రకటిస్తూ కొత్త పోస్టర్‌ని విడుదల చేసింది టీమ్‌. ఇందులో అల్లు అర్జున్‌ చంకనెక్కి కూర్చుంది శ్రీలీల. ఈ పోస్టర్‌ ఆద్యంతం ఆకట్టుకుంది. శ్రీలీలకి ఇది బెస్ట్ ట్రీట్‌ అని చెప్పొచ్చు. అయితే ఈ ఇద్దరితో వెబ్‌ సిరీస్‌ చేస్తారా? ఓటీటీ ఫిల్మ్ చేస్తారా అనేది పెద్ద సస్పెన్స్. కానీ తాజాగా ఇన్‌సైడ్‌ టాక్స్ ప్రకారం బన్నీ, శ్రీలీల మీద ఒక యాడ్‌ షూట్‌ చేస్తున్నారని సమాచారం. ఆహాలో అల్లు అర్జున్‌ ఓ కొత్తగా ఆహా ఒరిజినల్స్ ని లాంచ్‌ చేయబోతున్నారట. ఇందులో వెబ్‌ సిరీస్‌లు, వెబ్ ఫిల్మ్స్ నిర్మించబోతున్నారట. దీనికి సంబంధించిన బాధ్యత బన్నీ తీసుకుంటున్నారని, ఆయన నిర్మాణంలోనే ఇవన్నీ రూపుదిద్దుకుంటాయని సమాచారం. దాని ప్రమోషన్స్ కోసమే అల్లు అర్జున్‌, శ్రీలీల లపై ప్రమోషనల్‌ యాడ్ చేస్తున్నారని టాక్‌.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement