Saturday, April 27, 2024

టీఎస్‌పీఎస్సీ – వివిధ ఉద్యోగ పరీక్షలకు కొత్త తేదీలు

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ కీల‌క ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. పలు ఉద్యోగ నియామ‌క ప‌రీక్ష‌ల‌కు కొత్త తేదీల‌ను ప్ర‌క‌టించింది. టీఎస్‌పీఎస్సీ. మే 16వ తేదీన అగ్రిక‌ల్చ‌ర్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి రాత‌ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు. మే 19న డ్ర‌గ్స్ ఇన్‌స్పెక్ట‌ర్, జూన్ 28న అసిస్టెంట్ మోటార్ వెహిక‌ల్ ఇన్‌స్పెక్ట‌ర్, జులై 18, 19వ తేదీల్లో భూగ‌ర్భ జ‌ల‌శాఖ‌లో గెజిటెడ్ పోస్టుల‌కు, జులై 20న భూగ‌ర్భ జ‌ల‌శాఖ‌లో నాన్ గెజిటెడ్ పోస్టుల‌కు రాత‌ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. ఇతర వివ‌రాల కోసం టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌ను సంద‌ర్శించొచ్చు

Advertisement

తాజా వార్తలు

Advertisement