Wednesday, May 1, 2024

రానా నాయుడు జోష్​.. రిలీజ్​ అయిన నెల తర్వాత దూకుడు

టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ లేటెస్ట్ గా బాలీవుడ్ లో చేేసిన వెబ్ సిరీస్ రానా నాయుడుతో. ఈ సిరీస్ తో ఓటీటీలో డెబ్యూ చేశాడు వెంకటేష్. ఈ సిరీస్‌లో రానా దగ్గుబాటి కూడా మరో ప్రధాన పాత్రలో నటించాడు. ఈ సిరీస్ భారీ అంచనాల మధ్య రిలజ్ అయింది, కానీ న్యూడిడిటీ & ఫౌల్ లాంగ్వేజ్ ఉండటంతో విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలను అందుకుంది. కానీ వెంకీ, రానా తమ నటనా చాతుర్యంతో ఆ విమర్శలను అదిగమించేశారు.

ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయ్యి ఒక నెల కంటే ఎక్కువే అవుతుంది, అయితే ఇది OTT లవర్స్ నుండి ఘనమైన ప్రేమను పొందుతూనే ఉంది. దీంతో, రానా నాయుడు నెట్‌ఫ్లిక్స్ ఇండియా టీవీ షోలలో రెండవ స్థానంలో ట్రెండింగ్‌లో ఉంది. ఇక దీంతో దక్షిణాది మార్కెట్‌లో బలపడాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న నెట్‌ఫ్లిక్స్ ఇండియా కూడా తన ప్రయత్నంలో పురోగతి సాధించినట్లు కనిపిస్తోంది.

ఈ సిరీస్‌లో సుచిత్రా పిళ్లై, గౌరవ్ చోప్రా, సుర్వీన్ చావ్లా ప్రముఖ పాత్రలు పోషించారు. కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ వర్మ దర్శకత్వం వహించిన రానా నాయుడు ప్రసిద్ధ అమెరికన్ టీవీ సిరీస్ రే డోనోవన్ అఫీషియల్ రీమేక్. కాగా, త్వరలో రానా నాయుడు పార్ట్ 2 కూడా రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement