Wednesday, May 1, 2024

అల్లా అందరినీ చల్లగా చూస్తారు.. మంత్రి పువ్వాడ

ఖమ్మం -..పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఖమ్మం నగరంలోని 23వ డివిజన్ ముస్తఫా నగర్ మజీద్ నందు 23వ డివిజన్ కార్పొరేటర్ షేక్ మక్బుల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హాజరైయ్యారు.ఈ సందర్భంగా ఉపవాసం ఆచరిస్తున్న ముస్లిం సోదరులకు ఖర్జూ రాలు, పండ్లు తినిపించి ఈరోజు దీక్షను విరమింపజేశారు. అనంతరం వారితో పాటు మంత్రి పువ్వాడ నమాజును ఆచరించి, దువా చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఖమ్మం ప్రజలంతా సుఖసంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని తాను ఎప్పుడూ కోరుకుంటానని అన్నారు. భక్తి శ్రద్ధలతో రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఉపవాసం చేస్తారని అన్నారు. ఖమ్మం ప్రజల బాగు కోసమే తాను ఎల్లవేళలా అందరికీ అందుబాటులో ఉన్నానని, ఉంటానని పేర్కొన్నారు..ఈ పవిత్ర రంజాన్ మాసంలో.. ఖమ్మం ప్రజలంతా ఆయు ఆరోగ్యాలతో వుండాలని అల్లా ను వేడుకోవడం జరిగిందని మంత్రి తెలిపారు.

.ఈ కార్యక్రమంలో ముస్తఫా నగర్ మస్జీద్ కమిటీ సదర్ సాహెబ్ అబ్ధుల్ రహమాన్, కమిటీ సభ్యులు ఇబ్రహీం, ఇషాక్, ఇస్మాయిల్, సలీం, సత్తార్, మహమ్మద్ ఆలీ, టిఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు తాజుద్దీన్, ఆశ్రీఫ్, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, పగడాల నాగరాజు, ఇలియాజ్, సోహెల్, తాజుద్దీన్, GVL నర్సింహారావు, జునైద్, ముజ్జు, అజీజ్, శేఖర్, అజ్జూ, జర్నలిస్ట్ జాని తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement