Thursday, April 25, 2024

TS: వ‌డ్ల‌కు మంచి రేటు లేదు.. క్వింటా రూ.1600 మాత్ర‌మే.. రోడ్డెక్కిన రైతులు

(ప్రభన్యూస్‌ బ్యూరో, ఉమ్మడి నల్గొండ‌): కాలం కలిసొచ్చింది.. వానాకాలం పోటీ పడి మరి వరిపంట సాగు చేశారు.. ఆరుగాలం కష్టపడి పండించారు.. చీడపీడల తాకిడిని తట్టుకొని ముందుకు సాగారు.. పండించిన ధాన్యం అమ్ముకునేందుకు అన్నదాతలు అరిగోస పడుతున్నారు. అయితే వరణుడు కన్నెర్ర చేయడంతో అకాలవర్షం కురిసి ధాన్యం వర్షార్పణమైంది. కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో అక్కడ పోసిన ధాన్యం తడిచిముద్ద అయింది. వీటికితోడు ధాన్యం అమ్ముకునేందుకు అన్నదాతలు తీవ్రఇక్కట్లు- పడుతున్నారు. ధాన్యం అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో 11లక్షల ఎకరాలకు పైగా వరి పంట సాగు చేశారు. అయితే నల్గొండ, సూర్యాపేట, యాదాద్రిభువనగిరి జిల్లాల్లో వరికోతలు ప్రారంభమయ్యాయి. ధాన్యం మార్కెట్‌ లోకి వస్తుంది. కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని చెప్పినప్పటికీ ఇప్పటి వరకు ఎక్కడ ప్రారంభం కాలేదు. కానీ రైతులు మాత్రం కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తున్నారు. అంతే కాకుండా వందల ట్రాక్టర్‌ లలో ధాన్యం మిల్లులకు తీసుకొస్తున్నారు.

మిల్లర్లు మాత్రం కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ధాన్యం కొనుగోలు చేసేందుకు మిల్లర్లు విముఖత వ్యక్తం చేస్తున్నారు. మిల్లుల ముందు వందల సంఖ్యలో క్యూ కడుతున్నాయి. ధాన్యం క్వింటా ఏ గ్రేడ్‌ 1960 రూపాయలు.. సాధారణ రకం క్వింటా 1940రూపాయల మద్దతు ధరను కేటాయించారు. అయితే మిల్లర్లు మాత్రం క్వింటా 1600రూపాయలకే కొనుగోలు చేస్తున్నారు. మిల్లర్లు, వ్యాపారులు కుమ్మకై రైతులను దోచుకుంటున్నారు. మద్దతు ధర ఇవ్వకుండా అన్నదాతను నిలువునా ముంచుతున్నారు.

ధాన్యం కొనుగోలుకు విముఖత వ్యక్తం చేయడం.. మద్దతు ధర ఇవ్వకపోవడంతో రైతులు రోడ్డెకుతున్నారు. మిర్యాలగూడ మిల్లర్లు దోచుకుంటు-న్నారని, మద్దతు ధర ఇవ్వడంలేదంటూ మిర్యాలగూడ-హుజుర్‌ నగర్‌ రహదారిలోని చిల్లేపల్లి బ్రిడ్జిపై రాస్తారోకో చేశారు. సుమారు నాలుగు గంటల పాటు రోడ్డుపై బైఠాయించారు. మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో విరమించారు. ఇప్పటి నుండి రైతులకు టోకెన్స్‌ ఇచ్చి మిల్లర్లు కొనుగోలు చేసే విధంగా ఏర్పాట్లు- చేస్తున్నారు. ఏది ఏమైనా మిల్లర్లు అన్నదాతను నిలువునా ముంచుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement